రజనీకాంత్ (Rajinikanth) హీరోగా దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కూలీ’ (Coolie). నాగార్జున (Nagarjuna), ఉపేంద్ర, శ్రుతిహాసన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ తాజాగా ఖరారైంది. ఆగస్టు 14న రిలీజ్ (Coolie Release Date) చేయనున్నట్టు టీమ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ క్రమంలో ఈ చిత్రం బిజినెస్ తెలుగులో హాట్ ప్రాపర్టీగా మారింది.
డైరక్టర్ లోకేష్ కనగరాజ్, ఇందులో పాల్గొన్న నటీనటులు, టెక్నీషియన్స్ ట్రాక్ రికార్డ్‌ను పరిశీలిస్తే, కూలీ తెలుగు హక్కులకు భారీ డిమాండ్ ఉంది. ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ..తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్స్ అందరూ తెలుగు హక్కుల కోసం సన్ పిక్చర్స్‌ను సంప్రదించారని తెలుస్తోంది.
దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్, గీతా ఆర్ట్స్ , ఎస్ నాగ వంశీ ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్‌ని కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని వినికిడి. అయితే నిర్మాత భారీగా రేటు చెప్తున్నారు. దాంతో కమీషన్ బేసిస్ లో ఈ చిత్రం రైట్స్ తీసుకుని రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాయిట.
ఇక రిలీజ్ నిమిత్తం వేసిన పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. అందులో రజనీకాంత్ విజిల్ వేస్తూ కనిపించారు. బంగారం స్మగ్లింగ్ అంశంతో ముడిపడి ఉన్న యాక్షన్ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. కొన్ని రోజుల క్రితమే చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.