చాలా మంది నిర్మాతలు ఒక ప్లాఫ్ వస్తే భరించలేక వెనక్కి తగ్గిపోతారు. కానీ ధైర్యంగా ఆ నష్టాలను ఎదుర్కొని, సమస్య ఎక్కడుందో కనుక్కొని, రిక్టిఫై చేసుకుని తిరిగి హిట్ కొట్టే నిర్మాతలు చాలా అరుదు. అలాంటి వారిలో పీపుల్స్ మీడియా విశ్వ ప్రసాద్ పేరు ముందుంటుంది.

తాజాగా తేజ సజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ మూవీతో ఆయన మళ్లీ తన సత్తా చాటుకున్నారు. థియేటర్లలో బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పటికే రూ.100 కోట్లు వసూలు చేసి, ఇంకా వేగంగా రికార్డులు క్రియేట్ చేస్తోంది.

కానీ ఈ విజయానికి వెనక ఆయన ఎదుర్కొన్న కష్టాలు వేరే లెవెల్. ప్రమోషన్లలో మాట్లాడిన విశ్వ ప్రసాద్ ఇలా చెప్పారు—

“గతేడాది నేను నిర్మించిన వడక్కుపట్టి రామస్వామి, ఈగల్‌, మనమే, విశ్వం, స్వాగ్‌, మిస్టర్ బచ్చన్ సినిమాలు థియేటర్లలో బాగానే ఆడాయి. కానీ ఓటీటీలో లేట్‌గా రిలీజ్ కావడంతో లాభాలు రాలేదు. దాంతోనే నాకు రూ.140 కోట్ల నష్టం వచ్చింది. ఇంకా అవి రికవరీ కాలేదు. రికవరీ అవుతాయన్న నమ్మకమూ లేదు. అయినా సినిమాలపై ఉన్న ప్రేమే నన్ను ముందుకు నడిపిస్తోంది” అని.

ఇంత పెద్ద నష్టాన్ని తట్టుకుని కూడా కొత్త తరహా కథలను ఎంచుకుని ముందుకు వెళ్తున్న నిర్మాత విశ్వ ప్రసాద్ నిజంగా ఇండస్ట్రీలో అరుదైన ఉదాహరణ. ఇప్పుడు మిరాయ్ బ్లాక్‌బస్టర్‌గా దూసుకుపోవడం ఆయన పట్టుదలకి తగిన రివార్డ్ అని చెప్పాలి.

, , , , ,
You may also like
Latest Posts from