
ఒక్క సినిమా చాలు – ఎవరి జాతకం అయినా తారుమారు కావడానికి. ‘లిటిల్ హార్ట్స్’ హీరో మౌళి అదే నిరూపించాడు.
ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు అతని పేరు ఎవరికి తెలియదు. రిలీజ్ అయిన తర్వాత… నిర్మాతలు అతని చుట్టూ తిరుగుతున్నారు!
ఇప్పుడైతే మౌళి ఫోన్ బిజీ టోన్‌లోనే ఉంది. మైత్రీ మూవీస్ మౌళికి కోటి రూపాయల అడ్వాన్స్ ఇచ్చినట్టు టాక్. దర్శకుడు ఎవరో ఇంకా సీక్రెట్‌గానే ఉంచారు కానీ, హీరో మాత్రం లాక్ అయ్యాడట.
తొలి సినిమా కోసం ఐదు నుంచి పది లక్షల మధ్య తీసుకున్న మౌళి… ఇప్పుడు కోటి రేంజ్‌కి జంప్ అయ్యాడు!
మైత్రీ మాత్రమే కాదు — మరికొన్ని టాప్ బ్యానర్లు కూడా లైన్లో ఉన్నాయట. ఎవరు ముందుగా డైరెక్టర్ సెట్ చేస్తారో, వాళ్లదే మౌళి రెండో సినిమా అని ఇండస్ట్రీ టాక్.
ఇక క్లారిటీ – ‘లిటిల్ హార్ట్స్’ హిట్‌తో మౌళి కెరీర్ కొత్త టర్న్‌లోకి వెళ్లిపోయింది…
తదుపరి సినిమా ఏదో చూడాలి కానీ, రేట్ మాత్రం ఫిక్స్ – కోటి!
