పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రస్తుతం టఫ్ ఫేజ్‌లో ఉన్నా, వారి చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్టులు మాత్రం ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేయబోతున్నాయి. వాటిలో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నది ‘మిరాయ్’.
హనుమాన్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమా, భారీగా సెటప్ అవుతోంది. హిందీలో కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ , తమిళంలో ఏజీఎస్ సినిమాస్ , కన్నడలో హోంబలే ఫిలిమ్స్ – వీకే ఫిలిమ్స్ , మలయాళంలో శ్రీ గోకులం మూవీస్ వంటి స్టార్ బ్యానర్లు డిస్ట్రిబ్యూషన్‌లో దిగి రావడం ఈ ప్రాజెక్టుపై ఎంత నమ్మకం ఉందో చూపిస్తోంది. అంటే థియేటర్ల అలోట్మెంట్స్, రిలీజ్ స్మూత్‌గా జరగటం ఖాయం.
ఇటీవల విడుదలైన టీజర్ మాత్రం ఇండస్ట్రీ మొత్తాన్నీ ఆశ్చర్యపరిచింది. విజువల్స్, VFX లెవెల్ చూస్తేనే బిగ్-స్క్రీన్ ఎక్స్పీరియన్స్ క్లాస్‌గా ఉంటుందని క్లారిటీ వచ్చింది.
ఇక కంటెంట్ బాగా నచ్చితే, బాక్సాఫీస్ మ్యాజిక్ ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. అలా జరిగితే తేజ సజ్జా కొత్త లెవెల్ స్టార్‌డమ్‌కి చేరుకోవడం ఖాయం.
తేజా సజ్జా హీరోగా నటిస్తుండగా.. మంచు మనోజ్ విలన్‌గా చేస్తున్నాడు. రితికా నాయక్ హీరోయిన్. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. పీపుల్స్ మీడియా సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.
‘మిరాయ్’సెప్టెంబర్ 12న గ్రాండ్ రిలీజ్ – ఈ సినిమా తేజ కెరీర్‌ని మలుపుతిప్పుతుందా?