సినిమా పరిశ్రమ లో సెంటిమెంట్లు (Sentiments) ఎక్కువనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రతీ చిన్న విషయానికి , జాతకాలు, జ్యోతిష్యం, న్యూమరాలజీ (Numerology) వంటివి పరిశీలించి ముందుకు వెళ్తూంటారు. ఫస్ట్ లుక్ రిలీజ్ చేయటం నుంచి సినిమా ఓపెనింగ్ ముహూర్తం దగ్గరి నుంచి సినిమా టైటిల్స్ వరకూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే న్యూమరాలిజీ ప్రకారం హీరోలు, హీరోయిన్స్ పేర్లు మార్చుకున్న వాళ్లు ఉన్నారు.
గతంలో చాలామంది హీరోలు, హీరోయిన్లు తమ పేర్లు మార్చుకున్నారు. యాదృచ్ఛికమో ఏమో తెలియదు కానీ పేర్లు మార్చుకున్న తర్వాత సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి హీరో అల్లు అర్జున్ చేరబోతున్నట్లు తెలుస్తోంది.
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తన పేరులో చిన్నచిన్న మార్పుచేర్పులు చేసే ఆలోచనలో ఉన్నాడట అల్లు అర్జున్. ఈ మేరకు ఇప్పటికే అతడు కొంతమంది న్యూమరాలజిస్టుల్ని సంప్రదించినట్టు చెబుతున్నారు .
ప్రస్తుతం వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం, బన్నీ తన పేరుకు అదనంగా U, N అనే అక్షరాల్ని (Alluu Arjunn) జత చేస్తాడనే టాక్ వినిపిస్తోంది.అందులో నిజమెంత అమనేది అల్లు అర్జున్ పుట్టినరోజు నాడు ఓ క్లారిటీ వస్తుంది.
ఇక అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా సినిమా ప్రకటనలు కూడా రాబోతున్నాయి. బన్నీ-అట్లీ సినిమాను ఎనౌన్స్ చేయబోతున్నారు. అదే విధంగా బన్నీ-త్రివిక్రమ్ సినిమాపై కూడా ప్రకటన వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.