నాగచైతన్య హీరోగా రూపొంది రిలీజ్ కు సిద్దమైన చిత్రం తండేల్ (Thandel). సాయిపల్లవి హీరోయిన్‌గా చేస్తున్న ఈ చిత్రానికి చందూమొండేటి డైరెక్టర్. ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది టీమ్. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి నాగచైతన్యకు, సాయి పల్లవికి ఎంతెంత రెమ్యునరేషన్స్ ఇచ్చారనే వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
2018లో గుజరాత్ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా వస్తోన్న ఈ మూవీని గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు భారీ ఎత్తున నిర్మించారు. తాజాగా ఈ చిత్రానికి దాదాపు ఏడాదికి పైగా నాగచైతన్య పనిచేస్తున్నారు.
దాదాపు రెండు సినిమాల కష్టం ఈ సినిమాది. ఈ సినిమాపై చాలా ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు నాగచైతన్య. ఈ నేపధ్యంలో తన డేట్స్ ఎక్కువ కేటాయించినా , చైతు మాత్రం ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేయలేదని తెలుస్తోంది.
ఫిల్మ్ నగర్ సర్కిల్స్ నుంచి వినపడుతున్న దాన్ని బట్టి తండేల్ చిత్రానికి నాగచైతన్య రూ.10 కోట్లు తీసుకుంటుండగా.. సాయి పల్లవి రూ.5 కోట్లు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. తండేల్ నాగచైతన్య-చందూ మొండేటి కాంబోలో రాబోతున్న మూడో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
తండేల్‌లో సాయిపల్లవి శ్రీకాకుళం అమ్మాయి సత్య పాత్రలో కనిపించనుంది. తండేల్ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన బుజ్జి తల్లి సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది.