పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు’ ఈ నెల 24న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటించింది. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ప్రారంభమై ఎంత కాలం అయినా, ఎన్ని డిలేలైనా… మంచి బిజినెస్ చేసిందని, జూలై 24న థియేటర్లలోకి ఎంటర్ ఇవ్వబోతుందని చెప్తున్నారు.ఈ నేపధ్యంలో సినిమాకి సంబంధించిన బ్రేక్‌ఈవెన్ లెక్కలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్‌ఈవెన్ సాధించాలంటే దాదాపు ₹100 కోట్ల వరకు షేర్ వసూలు కావాల్సి ఉంటుంది. ఇందులో ఆంధ్రా (6 టెరిటరీస్ కలిపి) భాగంగా సుమారు ₹50 కోట్లు, సీడెడ్ ఏరియా కోసం ₹16 కోట్లు బ్రేక్‌ఈవెన్‌గా లాక్ చేశారు. ఇక నైజాం డీల్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. త్వరలోనే అఫీషియల్ క్లారిటీ రానుంది.
కానీ నిర్మాత లాభాల్లోకి రావాలంటే కేవలం బ్రేక్‌ఈవెన్ సాధించినంత మాత్రాన సరిపోదు. భారీ బడ్జెట్ దృష్ట్యా, రూ.150 కోట్లకు పైగా షేర్ వసూలు అవ్వాల్సిందే. అప్పుడు మాత్రమే ఈ పాన్ ఇండియా సినిమా నిర్మాతకు పూర్తిగా “సేఫ్ జోన్” లెక్క.
ఇంతవరకూ ఎదురైన ఆలస్యాల్ని దాటి, భారీ అంచనాల నడుమ థియేటర్‌కు వస్తున్న ఈ ప్రాజెక్ట్ – బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు దూసుకుపోతుందో చూడాలి!