మార్నింగ్ షోకే హిట్ టాక్ తెచ్చుకున్న ‘మిరాయ్‌’ గురించి ఒక్క మాటే వినిపిస్తోంది – “విజువల్స్ అదరగొట్టేశాయి!” అని. ఈ మధ్య కాలంలో వీఎఫ్ఎక్స్ చాలా సినిమాలకు తలనొప్పిగా మారింది. బడ్జెట్ ఎక్కువైనా, ఎఫెక్ట్స్ యావరేజ్ గా ఉంటే సినిమా ఫలితమే రివర్స్ అయిపోతుంది. కానీ ‘మిరాయ్‌’ మాత్రం ఆ ట్రాప్ లో పడలేదు. విజువల్స్ విషయంలో ఒక్క లోపం కనిపించకుండా, తక్కువ ఖర్చులోనే థియేటర్లో హాలీవుడ్ రేంజ్ ఫీలింగ్ ఇచ్చేసింది.

ఇది ఇలా జరగడానికి కారణం ఏంటో తెలుసా? అసలు హైలైట్ అక్కడే ఉంది.

‘మిరాయ్‌’కి లైఫ్ ఇచ్చిన విజువల్స్ టీమ్, అసలైన అసైన్‌మెంట్ మాత్రం ‘రాజాసాబ్‌’ది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘రాజాసాబ్‌’ కోసం ఒక ప్రత్యేక వీఎఫ్ఎక్స్ టీమ్‌ని రెడీ చేసింది. వాళ్లంతా ఫుల్ టైమ్ ఆ ప్రాజెక్ట్ మీదే ఉండాల్సింది. కానీ ‘రాజాసాబ్‌’ రిలీజ్ వాయిదా పడింది. దాంతో ఆ టీమ్ ఖాళీగా ఉండిపోయింది. అప్పుడు డెసిషన్ మార్చి, అదే టీమ్‌ని ‘మిరాయ్‌’కి షిప్ట్ చేసారు. ఫలితం? – ఇప్పుడు ఆల్‌రెడీ ట్రెండ్ అవుతున్న మైండ్ బ్లోయింగ్ విజువల్స్!

ఒకవేళ ‘రాజాసాబ్‌’ డేట్ మిస్సవకపోయి, టైమ్ కి రిలీజ్ అయి ఉంటే.. ‘మిరాయ్‌’ కోసం వేరే వీఎఫ్ఎక్స్ టీమ్ వెతకాల్సి వచ్చేది. అప్పుడు ఈ స్థాయి అవుట్‌పుట్ వచ్చేది కాదేమో! అంటే క్లియర్‌గా చెప్పాలంటే – ‘రాజాసాబ్‌’ డిలే, ‘మిరాయ్‌’కి లక్కీ టర్న్ అయ్యింది.

అయితే ఇక్కడ మైండ్ బ్లోయింగ్ కిక్ ఏంటంటే ‘మిరాయ్‌’కే ఇంత అబ్బురపరిచే ఎఫెక్ట్స్ వచ్చాయి అంటే… ‘రాజాసాబ్‌’లో విజువల్స్ ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయో ఊహించుకోండి!

, , , , ,
You may also like
Latest Posts from