
“నెగిటివ్ టాక్ వస్తే అమీర్‌పేట్‌లో కట్ డ్రాయిర్ లో ఉరుకుతా!” – డైరెక్టర్ సెన్సేషన్!
సినిమా రిలీజ్‌కు ముందు డైరెక్టర్లు ఈ రోజుల్లో పబ్లిక్ ముందు ఎమోషన్‌తో, కాస్త ఓవర్ కాంఫిడెన్స్‌తో, వైరల్ అయ్యేలా కామెంట్స్ చేసే ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. ఇటీవలే త్రిబాణధారి బార్బరిక్ సినిమా విషయంలో దర్శకుడు మోహన్ శ్రీవత్స— “సినిమా మీకు నచ్చకపోతే నా చెప్పుతో నేనే నన్ను కొట్టుకుంటా!” అని ఛాలెంజ్ చేసి, తర్వాత ఆ ఛాలెంజ్ వెనక్కి తీసుకుంటానని చెప్పి నిజంగానే చెప్పుతో తనను తాను కొట్టుకుని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు.
ఇప్పుడు అదే ట్రాక్‌లో మరో డైరెక్టర్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి!
అఖిల్ రాజ్ – తేజస్విని జంటగా నటించిన తాజా విలేజ్ లవ్ ఎంటర్టైనర్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఈ నెల 21న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాకు దర్శకుడు సాయిలు కంపాటి బుధవారం జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఇచ్చిన స్పీచ్… సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.
“నేను మీ కోసం ఫ్యాన్సీ సినిమాలు రాయను… నా ఊరి ప్రేమ కథలే రాస్తా!” – సాయిలు ఎమోషనల్ అవుట్బర్స్ట్
స్టేజ్‌పై ఎమోషనల్‌గా మాట్లాడుతూ సాయిలు ఇలా అన్నారు—
“నేను పల్లెటూరి వాడ్ని. నాకు హెలికాఫ్టర్ దిగే హీరోలు, మెట్రో నుంచి వాకౌట్ అయ్యే యాక్టర్లు తెలియదు. ఊర్లో రైతులు, ఆటో డ్రైవర్లు, కాలేజీ అమ్మాయిల మధ్య పుట్టే మొరటు ప్రేమ… అదే నాకు తెలుసు. అదే నా ఒరిజినాలిటీ.”
“నా కథ మీకు నచ్చకపోతే పర్లేదు, లైట్ తీసుకోండి. కానీ ప్లీజ్… నెగిటివ్ ప్రచారం మాత్రం చెయ్యొద్దు.” గ్రౌండ్‌కు దగ్గరగా ఉన్న రా కథని చెప్పాలని తన కోరికను వివరించారు.
“నెగిటివ్ టాక్ వస్తే అమీర్‌పేట్‌లో అర్ధనగ్నంగా తిరుగుతా!”
“21న సినిమా రిలీజ్ అవుతుంది. ఒకవేళ సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే అమీర్ పేట్ సెంటర్లో అర్ధనగ్నంగా కట్ డ్రాయిర్ లో ఉరుకుతాను’ ! మా టీం చాలా కష్టపడ్డాం. మా శ్రమకు తగిన రిటర్న్ వస్తుందనే నమ్మకం ఉంది.”
అన్న ఈ ఒక్క లైన్… కట్ అయి సోషల్ మీడియాలో షేర్ అవుతూ వైరల్ అవుతోంది.
“ఇది మా ఊరి, మా వీధి ఎమోషన్” – డైరెక్టర్ ఫుల్ సెంటిమెంట్
15 ఏళ్ల పాటు ఓ జంట అనుభవించిన నరకం… ఆ రియల్ ఎమోషన్ని సినిమాలో చూపిస్తున్నట్టు చెప్పారు. “మీకు నచ్చకపోతే మమ్మల్ని క్షమించండి. కానీ చిన్న సినిమాల్ని చంపే నెగిటివ్ పబ్లిసిటీ మాత్రం చేయొద్దు.”
అని మరోసారి వినయంగా రిక్వెస్ట్ చేశారు. అందుకే సోషల్ మీడియా దీనిని పికప్ చేసి వైరల్ చేస్తున్నది.
వైరల్ ఛాలెంజ్ నిజమవుతుందా?
లేక సినిమా పాజిటివ్ టాక్‌తో డైరెక్టర్ ఛాలెంజ్ ఆగిపోతుందా?
ప్రేక్షకులే ఫైనల్ జడ్జ్!
