
తన ముక్కు సూటిగా మాట్లాడే స్టైల్‌తో తరచూ హాట్ టాపిక్ అవుతూ ఉండే హీరో విశాల్ మళ్లీ ఒక వివాదాస్పద స్టేట్‌మెంట్‌తో ఇండస్ట్రీని కుదిపేశాడు.
ఒక ఇంటర్వ్యూలో ఫిల్మ్ అవార్డుల విలువ గురించి ప్రశ్నించగా, విశాల్ బోల్డ్‌గా స్పందిస్తూ—
“నాకు అవార్డుల మీద నమ్మకం లేదు. అవన్నీ అర్థంలేనివి. ఎనిమిది మంది కలిసి ఎనిమిది కోట్ల మంది అభిరుచిని ఎలా నిర్ణయించగలరు? ఇదే నేషనల్ అవార్డ్స్‌కి కూడా వర్తిస్తుంది,” అని స్పష్టం చేశారు.
తనకు అవార్డులు రాకపోవడం వల్లే ఇలా అనుకుంటున్నారా అని అడిగితే, విశాల్ తేలిగ్గా నవ్వుతూ—
“అది కాదు. నాకు ఆ కాన్సెప్ట్‌నే నచ్చదు. ఎవరో అవార్డు ఇస్తే నేనే దాన్ని డస్ట్‌బిన్‌లో వేసేస్తా,” అని షాకింగ్‌గా అన్నారు.
ఇటీవల నటి ధన్సికాతో నిశ్చితార్థం జరిగిన విశాల్, ప్రస్తుతం ఒక మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ షూటింగ్‌లో ఉన్నాడు. అయితే ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి —
కొంతమంది ఆయన నిజాయితీని ప్రశంసిస్తే, మరికొందరు “ఇది పబ్లిసిటీ గిమ్మిక్” అంటున్నారు.
“అవార్డ్ లు డస్టబిన్ లో వేస్తా” — విశాల్ మాటలతో సోషల్ మీడియా దద్దరిల్లింది!
