ఇండియన్ 2 సినిమా ఒక సమయంలో దేశవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. శంకర్ – కమల్ హాసన్ ల కలయికలో వచ్చిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో బోలెడు హైప్ ఉండేది. కానీ రిలీజ్ తర్వాత… అందరూ ఊహించిన దాని కంటే పూర్తిగా భిన్నమైన ఫలితాన్ని చూపింది. సాంకేతికంగా బాగున్నా, కథనం పేలవంగా ఉండటంతో ఇండియన్ 2 పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిల్ కావడమే కాదు, డిజిటల్ డీల్‌లు కూడా నష్టాల్లో పడిపోయాయి.

దీంతో ఇప్పుడు ఇండియన్ 3 ప్రాజెక్ట్ ప్రారంభం అవుతుందో తెలియని పరిస్దితుల్లోకి చేరింది. షూటింగ్‌లో ఇంకా కొన్ని భాగాలు మిగిలి ఉన్నప్పటికీ, లైకా ప్రొడక్షన్స్ మాత్రం మరింత ఖర్చు పెట్టడానికి సిద్ధంగా లేదు. అదే సమయంలో డైరెక్టర్ శంకర్ మాత్రం భారీ బడ్జెట్ కావాలని పట్టుబడుతున్నారు. ఇప్పటికే శంకర్-లైకా మధ్య సంబంధాలు చల్లబడిపోయాయి. ఈ మధ్య జరిగిన విభేదాల వల్ల కమల్ హాసన్ కూడా తన డేట్స్ ఇవ్వడానికి వెనుకాడుతున్నారు – “ఇద్దరి మధ్య సమస్యలు క్లియర్ అయితేనే ముందుకు వెళ్దాం” అన్నట్టుగా స్టాండ్ తీసుకున్నారు.

ఈ కష్ట సమయంలోనే రంగంలోకి దిగాడు సూపర్‌స్టార్ రజనీకాంత్. శంకర్‌తోనూ, లైకా ప్రొడక్షన్స్‌తోనూ మంచి అనుబంధం ఉన్న రజనీ, ఈ రెండు పార్టీల మధ్య మద్యవర్తిగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారు.

ఇంకా కీలక విషయం ఏంటంటే – గేమ్ ఛేంజర్ డిజాస్టర్ తర్వాత నెట్‌ఫ్లిక్స్ ఇండియన్ 3కి డిజిటల్ డీల్ నుంచి తప్పుకుంది. దాంతో, సినిమా డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేయాలన్న ప్లాన్‌ కూడా బెడిసికొట్టింది.

లైకా వాళ్లు ఇప్పుడు శంకర్ పారితోషికం కట్ చేయాలని ఒత్తిడి పెడుతుండగా, శంకర్ మాత్రం ప్రాజెక్ట్‌కి న్యాయమైన బడ్జెట్ అవసరమంటూ మడిగొడుతున్నారు.

ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో రజనీ చొరవ తీసుకుని ఇండియన్ 3ని మళ్ళీ పునర్వ్యవస్థీకరించే ప్రయత్నాల్లో ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పుడు అసలైన ప్రశ్న:

“ఇండియన్ 3ని నిలబెట్టే శక్తి రజనీకే ఉందా?”
“ఈ గొడవల నుంచి సినిమా బయటపడతుందా, లేక మధ్యలోనే ఆగిపోతుందా?”

సినిమా ప్రపంచం మొత్తం ఇప్పుడు రజనీకాంత్ మధ్యవర్తిత్వం ఫలిస్తుందా? అనే దానిపై ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

, , , , ,
You may also like
Latest Posts from