ఒకప్పుడు బాలీవుడ్‌లో గోల్డెన్ ఫేజ్ ఎంజాయ్ చేసిన కృతి సనన్… “మిమీ” సినిమాతో నేషనల్ అవార్డు కూడా గెలిచింది. కానీ ఆదిపురుష్, గణపత్, తెరి బాతోన్ మేన్ ఐసా ఉల్జా జియా వరుస ఫ్లాప్స్ తర్వాత ఆమె కెరీర్ మందగించింది.
ఇటీవల ఆమె చేసిన షాకింగ్ కామెంట్స్ బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యాయి. “బాలీవుడ్ మేకర్స్ మహిళా నటులను సెకండరీ సిటిజెన్స్‌లా ట్రీట్ చేస్తున్నారు” అంటూ నేరుగా ఆరోపించింది.
ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నది ఏమిటంటే – ఇలాంటి బోల్డ్ స్టేట్మెంట్స్ సాధారణంగా టాప్ లీగ్ నుండి జారిపోతున్న హీరోయిన్స్ నుంచే వస్తాయని. ప్రస్తుతం కృతి చేతిలో ఉన్న ఒక్క పెద్ద ప్రాజెక్ట్ “తేరే ఇష్‌క్ మేన్” (దనుష్ హీరోగా) మాత్రమే. దాని తప్ప మరో బిగ్-టికెట్ సినిమా లేనట్టే.
నిజంగానే కృతి సనన్ స్టార్‌డమ్ మెల్లగా తగ్గిపోతుందా? లేక ఆమె మాటలే ఇండస్ట్రీలో కొత్త డిబేట్ స్టార్ట్ చేస్తున్నాయా?