టాలీవుడ్‌లో చాలా కాలంగా “మెగా క్యాంప్ – అల్లు క్యాంప్ విడిపోయాయట” అనే టాక్ వినిపిస్తూనే ఉంది. కానీ ఎవ్వరూ పబ్లిక్‌గా ఏమీ మాట్లాడకపోవడంతో అది కేవలం రూమర్‌గానే మిగిలిపోయింది. కానీ ఈ సారి మాత్రం ఒక వేడుకే ఆ రూమర్‌కు బలమైన బూస్ట్ ఇచ్చిందంటే?

అవును… మెగాస్టార్ చిరంజీవి ఇంట దీపావళి బాష్ ఘనంగా జరిగింది. మెగా ఫ్యామిలీ మొత్తం వెలుగులమయమైపోయింది. వెంకటేష్–నాగార్జున ఫ్యామిలీలు, నయనతార–విగ్నేష్ జంట, రామ్ చరణ్–ఉపాసన, వరుణ్ తేజ్–లావణ్య, నిహారిక, నాగబాబు ఫ్యామిలీ, పవన్ భార్య అన్న ఇలా అందరూ అక్కడే ఉన్నారు.

అదే పార్టీలో ఉపాసన శ్రీమంత వేడుక కూడా జరిగింది. చరణ్–ఉపాసన దంపతులు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారని మెగాస్టార్ స్వయంగా వెల్లడించారు. అంటే – దివాళి బాష్, శ్రీమంత వేడుక – రెండూ మెగా హౌస్‌లో కలిసిపోయిన సంబరాలు.

కానీ అదే వేడుకలో…

అల్లు ఫ్యామిలీ ఒక్కరూ కూడా కనిపించకపోవడం!
ఇండస్ట్రీ మొత్తానికి ఇది ‘హాట్ టాపిక్’గా మారింది.

అల్లు అరవింద్, అల్లు అర్జున్, శిరీష్, స్నేహ ఇలా ఎవరూ దివాళి బాష్‌లో కానీ, శ్రీమంత వేడుకలో కానీ లేరు. సోషల్ మీడియాలో వదిలిన వీడియోలు, ఫొటోలు చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

అదీ కాకుండా — అదే సమయంలో స్నేహ రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో “మా దివాళి సెలబ్రేషన్స్” అంటూ ఫొటోలు షేర్ చేయడం, అందులో శిరీష్ కాబోయే భార్య కూడా కనిపించడం, ఈ రూమర్స్‌కి మరింత ఇంధనం పోసింది.

ఇక ఇండస్ట్రీలో మాట:
“ఇద్దరు కుటుంబాలు వేరుగా వేడుక చేసుకున్నారా?”
“మెగా – అల్లు మధ్య విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయా?”

ఈ ఒక్క వేడుకతోనే రెండు ఫ్యామిలీల ఈక్వేషన్ గురించి కొత్తగా మళ్ళీ చర్చ మొదలైంది.

దివాళి వెలుగులు ఈసారి రెండు ఇళ్లలో వెలిగాయి… కానీ అదే వెలుగుల్లో ఒక చీకటి గ్యాప్ మాత్రం స్పష్టంగా కనిపించిందన్నది టాక్!

, , , , , ,
You may also like
Latest Posts from