బాహుబలి తర్వాత ప్రభాస్ మళ్లీ తన సిగ్నేచర్ “బోయ్ నెక్స్ట్ డోర్” లుక్‌తో వస్తున్నాడు! ‘మిర్చి’, ‘వర్షం’, ‘డార్లింగ్’ లాంటి హిట్‌లను గుర్తుచేసేలా, దర్శకుడు మారుతితో కలిసి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ద రాజా సాబ్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే రిలీజ్ చేసిన పోస్టర్, టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఇక తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాకు ఓటీటీ వేదికల నుండి భారీ ఆఫర్లు వెల్లువలా వచ్చాయి. ప్రముఖ స్ట్రీమింగ్ జైంట్ నెట్‌ఫ్లిక్స్, కేవలం హిందీ వెర్షన్ హక్కులకే రూ.100 కోట్ల భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్టు టాక్. ఇది ఒక్క భాష హక్కులకే ఇంత పెద్ద మొత్తం కావడం సినిమాపై ఎంత క్రేజ్ ఉందో చెబుతోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతాన్ని ఎస్.ఎస్. థమన్ అందిస్తున్నాడు. అన్ని హంగులతో తెరకెక్కుతున్న ‘ద రాజా సాబ్’, 2025 డిసెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది.
ఈసారి ప్రభాస్ మాస్ కాకుండా క్లాస్‌తో హిట్ కొట్టేస్తాడా?
వెయిట్ చేస్తూ చూడాల్సిందే!