కింగ్ నాగార్జున కెరీర్‌లో మైలురాయిగా నిలవబోయే 100వ సినిమాపై భారీ బజ్ మొదలైంది. ‘కుబేర’, ‘కూలీ’ లాంటి సినిమాల్లో తన ఎనర్జీతో ప్రేక్షకులను అలరించిన నాగ్, ఇప్పుడు పూర్తిస్థాయి లీడ్‌గా #King100 కోసం సెట్ అయ్యారు.

మొదట ఆయన బర్త్‌డే రోజున అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వాలని అనుకున్నారు కానీ, టీమ్ వ్యూహాత్మకంగా నిశ్శబ్దంగా షూట్ మొదలు పెట్టాలని నిర్ణయించింది.

ఇక ఈ ప్రాజెక్ట్‌కి ‘లాటరీ కింగ్’ అనే టైటిల్ చర్చల్లో ఉంది – ఫ్యాన్స్ మాత్రం ఇదే ఫైనల్ టైటిల్ కావొచ్చని గుసగుసలతో ఉత్సాహంగా ఉన్నారు.

ఈ సినిమాకు తమిళ దర్శకుడు ఆర్. కార్తిక్ దర్శకత్వం వహించబోతున్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
మ్యూజిక్ మాంత్రికుడు దేవి శ్రీ ప్రసాద్ (DSP) ట్యూన్స్ అందిస్తున్నారు.
నాగ్ సరసన ముగ్గురు హీరోయిన్‌లు నటించబోతున్నారన్నది మరో హైలైట్.

సినిమా ఫుల్ ఎంటర్టైనర్‌గా, కామెడీ, స్టైల్, ఎమోషన్ అన్నీ కలిపిన హంగామా అవుతుందని టాక్. ఇంకా అధికారిక ప్రకటన మాత్రం కొంత గడువు పడనుంది కానీ — “లాటరీ కింగ్” షూట్ ఇప్పటికే మొదలైందన్నది కన్ఫర్మ్‌డ్ న్యూస్.

“నాగ్ వందో సినిమా టైటిల్ ఇదేనా?” అన్న ఆసక్తిని పెంచే ఈ అప్‌డేట్ ఫ్యాన్స్‌లో హీట్ పెంచేస్తోంది!

, , , , ,
You may also like
Latest Posts from