టాలీవుడ్‌ను కుదిపేస్తున్న బెట్టింగ్ యాప్‌ల వివాదంలో తాజాగా యాక్టర్ విజయ్ దేవరకొండ పేరు కూడా కలిపి వినిపించగా, ఆయన ఈ రోజు ఈన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ముందు హాజరయ్యారు. ఇటీవలే ‘కింగ్‌డమ్’ అనే సినిమా విడుదల ప్రపమోషన్స్ తో బిజీగా ఉన్న విజయ్, విచారణ అనంతరం తన స్టాండ్‌పై తొలిసారిగా స్పందించారు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ… ‘‘బెట్టింగ్ యాప్ కేసులో నా పేరు రావడంతో విచారణకు పిలిచారు. దేశంలో బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్.. ఇలా రెండు రకాలు ఉన్నాయి. నేను A23 అనే గేమింగ్ యాప్‌ని ప్రమోట్ చేశానని క్లారిటీ ఇచ్చా. బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్‌కి సంబంధం లేదు. గేమింగ్ యాప్స్ చాలా రాష్ట్రాల్లో లీగల్. గేమింగ్ యాప్స్‌కి జీఎస్టీ, టాక్స్, అనుమతులు, రిజిస్ట్రేషన్ ఉంటాయి. నా బ్యాంకు లావాదేవీల వివరాలన్నీ ఈడీకి సమర్పించా. నేను ప్రమోట్ చేసిన A23 యాప్ తెలంగాణలో ఓపెన్ కాదు. నేను లీగల్ గేమింగ్ యాప్‌ను మాత్రమే ప్రమోట్ చేశా. సంబంధిత కంపెనీతో నేను చేసుకున్న ఒప్పందం వివరాలూ ఈడీకి వెల్లడించా’’ అని తెలిపారు.
ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్‌లో 25 మంది ప్రముఖులపై FIR నమోదయ్యింది. వారందరికీ ఈడి నోటీసులు పంపింది. కొందరు ఇప్పటికే విచారణకు హాజరవుతుండగా, మిగతావారు త్వరలో రావాల్సి ఉంది.