తమిళ స్టార్ విజయ్ (Vijay) హీరోగా దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan). వచ్చే ఏడాది జనవరి 9న (Jana Nayagan Release Date) ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. రాజకీయాల్లోకి వెళ్లిన విజయ్ ఆఖరి చిత్రం ఇదేనంటూ తమిళనాట కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి రేంజిలో బిజినెస్ జరిగింది.
ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగినట్లు సమాచారం. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ 78 కోట్లకు అమ్ముడుపోగా, సినిమా డిజిటల్ రైట్స్ 121 కోట్లకు అమ్ముడయ్యాయి.
తమిళనాడు థియేట్రికల్ రైట్స్ 90 కోట్లకు అమ్ముడయ్యాయి. ఈ బ్రేక్ ఈవెన్ మార్క్ సాధించాలంటే, ఈ చిత్రం తమిళనాడు నుండి 200 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేయాలి.
విజయ్ గత చిత్రాలు, లియో మరియు ది గోట్ రెండూ తమిళనాడులో 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేశాయి. కాబట్టి సినిమాకు పాజిటివ్ మౌత్ టాక్ వస్తే విజయ్ కి ఇది పెద్ద పని కాదు.
పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘జన నాయగన్’లో మమితా బైజు, బాబీ దేవోల్, ప్రియమణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ చివరి సినిమా కానున్న నేపథ్యంలో ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికే ప్రణాళికలో భాగంగా ప్రత్యేక గీతాన్ని రూపొందించినట్టు సమాచారం.
అందులో దర్శకులు లోకేశ్ కనగరాజ్, అట్లీ, నెల్సన్ దిలీప్ కుమార్లతోపాటు ఓ హీరో అతిథి పాత్రల్లో సందడి చేయనున్నారని తెలిసింది. ఇది విజయ్ 69వ సినిమా. తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించిన విజయ్.. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.