టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ గురించి అకస్మాత్తుగా సోషల్ మీడియాలో షాకింగ్ వార్తలు వినిపించాయి. “కాజల్ ప్రమాదానికి గురైంది, ప్రాణాపాయం” అంటూ ఫేక్ న్యూస్‌ వైరల్ అయింది. అభిమానులు గందరగోళానికి గురై ఆందోళన చెందారు.

అయితే, ఈ రూమర్స్‌కి స్వయంగా కాజల్ చెక్ పెట్టింది. రాత్రి ఆలస్యంగా సోషల్ మీడియాలో రాసుకున్న పోస్ట్‌లో ఇలా చెప్పింది:

“నేను యాక్సిడెంట్‌కి గురయ్యాను, ఇక లేను అని పుకార్లు వినిపిస్తున్నాయి. నిజంగా ఇవన్నీ బేస్‌లెస్‌ రూమర్స్‌. పూర్తిగా అబద్ధం. కాస్త నవ్వొచ్చేలా ఉన్నాయి కూడా.”

కాజల్ ఇంకా స్పష్టంగా చెప్పింది:
“దేవుని దయతో నేను బాగున్నాను, పూర్తిగా సేఫ్‌గానే ఉన్నాను. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.”

అంతే కాదు, ఫేక్ న్యూస్ క్రియేట్ చేసే వారిపై సీరియస్‌గా స్పందిస్తూ,
“దయచేసి ఇలాంటి అబద్ధపు వార్తలు నమ్మకండి, షేర్ చేయకండి. మనం పాజిటివ్ ఎనర్జీ మీద ఫోకస్ చేద్దాం” అని విజ్ఞప్తి చేసింది.

మొత్తానికి… కాజల్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కాజల్ కూల్‌గా, క్లారిటీగా ఇచ్చిన రిప్లైతో రూమర్స్‌కు ఎండ్ కార్డు పడిపోయింది.

, , , ,
You may also like
Latest Posts from