సినిమా వార్తలు

కర్ణాటకలో కమల్ అభిమానుల ఆవేదనను పట్టించుకోరా?

తమిళ సినీ దిగ్గజం కమల్ హాసన్‌ తాజాగా తన భాషా వివాద వ్యాఖ్యలతో తీవ్ర వివాదానికి దారితీసిన సంగతితెలసిందే. తన కొత్త సినిమా ‘థగ్ లైఫ్’ ఆడియో రిలీజ్ ఈవెంట్ సందర్భంగా కమల్ చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో పెద్ద దుమారాన్ని రేపాయి. “కన్నడ భాష తమిళం నుంచే జన్మించింది” అని కమల్ హాసన్ వ్యాఖ్యానించడంతో… ఆయన కర్ణాటక ప్రజల ఆగ్రహానికి గురయ్యాయి.

ఈ మాటలపై కన్నడ భాషాభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర కోపం వ్యక్తం చేస్తూ, కమల్ హాసన్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే కమల్ దిగి రాలేదు. కోర్ట్ చెప్పినా వినలేదు. సారి చెప్పనన్నారు. ‘థగ్ లైఫ్’ సినిమాను కర్ణాటకలో రిలీజ్ చేయనని అన్నారు.

కోర్టు కలగ చేసుకున్నా కూడా కమల్ హాసన్ తన వైఖరి మార్చలేదు. “క్షమాపణ తప్పుకి చెబుతాం… నా మాట తప్పు కాదు” అని స్పష్టంగా ప్రకటించారు. ప్రజల భావోద్వేగాలను గౌరవించాల్సిన స్థితిలో కూడా ఆయన వాదనపై ఉన్నట్టుండి మొండి వైఖరి చూపడం ఆశ్చర్యకరం. కమల్ హాసన్ తన మాటలకు శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా… తాను సరైనదే అన్న మానసిక స్థితితో ఉండటం విమర్శలకు తావిచ్చింది.

ఈ విషయమై కర్ణాటక హైకోర్టు కూడా కమల్ హాసన్ వ్యాఖ్యలు ఎవరి అనుమతితో చేశారో? మీరు భాషా శాస్త్రజ్ఞులా? చరిత్రకారులా? అంటూ ప్రశ్నించింది. సామాజిక సమగ్రతకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేయడం సరికాదని నిప్పులు చెరిగింది.

కోర్టు ఆయనకు బహిరంగ క్షమాపణ చెప్పమని సూచించింది. కానీ కమల్ హాసన్ అదే తీరు కొనసాగిస్తూ… “ఇది తప్పు కాదు, అర్ధం చేసుకోలేని సమస్య” అంటూ తిరస్కరించారు.

దీంతో కమల్ హాసన్‌పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘థగ్ లైఫ్’ సినిమాకు కర్ణాటకలో విడుదల అవకాశం లేకుండా పోయింది. రాష్ట్రానికి చెందిన థియేటర్లలో పెద్దగా వసూళ్లను కోల్పోవడం ఖాయం. సినిమా పట్ల మంచి బజ్ ఉన్నా… ఫలితం లేకుండా పోయింది. ఇది కర్ణాటకలో ఉన్న కమల్ అభిమానులను ఇరకాటంలో పడేస్తోంది.

తన మాటలతో రాష్ట్రాల మధ్య, భాషల మధ్య వివాదం తెచ్చిన కమల్ హాసన్… ఒక గొప్ప నటుడిగా ఉండాలి గానీ, ఇలాంటి ఏటిట్యూడ్ ప్రదర్శించకూడదు అనేది అభిమానుల అభిప్రాయం. తన మాటలు తిరిగి తీసుకుని, ఒక హుందా చాటుకుంటే మంచి జరుగుతుందనడంల సందేహం లేదంటున్నారు.

Similar Posts