తెలుగు సినిమా ప్రేక్షకుల మనసుల్లో ఓ క్లాసీ హీరోయిన్‌గా నిలిచిపోయిన పేరు – కమిలినీ ముకర్జీ . శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఆనంద్ (2004) చిత్రంతో రంగప్రవేశం చేసిన ఆమె, ఆ ఒక్క సినిమాతోనే “గర్ల్ నెక్ట్స్ డోర్” ఇమేజ్‌ను సంపాదించుకుంది.
ఆ తర్వాత వరుసగా వచ్చిన స్టైల్, గమ్యం, గోదావరి, గోపీ గోపిక గోదావరి సినిమాల్లో నటించి మంచి ఫాలోయింగ్ సంపాదించింది. ఆమె నటనలోని సహజత్వం, స్క్రీన్‌పై కనిపించే అందం… ఫ్యాన్స్‌కి ప్రత్యేకమైన కనెక్ట్‌ని ఇచ్చాయి. అంతే కాదు, వెంకటేష్‌తో నాగవల్లి , నాగార్జునతో శిర్డి సాయి వంటి చిత్రాల్లో కూడా నటించి తన రేంజ్ చూపించింది.
కానీ ఒక్కసారిగా కెరీర్ ఆగిపోయింది!
2014లో రామ్ చరణ్ నటించిన గోవిందుడు అందరివాడేలే లో కీలక పాత్ర చేసిన కమలినీ, ఆ సినిమా తర్వాత మాత్రం తెలుగులో మరో ప్రాజెక్ట్ చేయలేదు. ఆ తరువాత కొన్ని మలయాళం, తమిళ సినిమాల్లో కనిపించినా… తిరిగి టాలీవుడ్‌లో తన క్రేజ్‌ని కొనసాగించలేదు. ఫలితం – ఫ్యాన్స్‌లో “కమలినీ ఎక్కడ? ఏమైంది?” అనే ప్రశ్నలు రేకెత్తాయి.
ఇప్పుడు అసలు నిజం బయట పెట్టింది కమలినీ
ప్రస్తుతం 41 ఏళ్ల వయసులో ఉన్న కమలినీ ముకర్జీ, మీడియాతో మాట్లాడుతూ తన నిర్ణయం వెనుక కారణాన్ని స్వయంగా వెల్లడించింది:
“ఒక సినిమాలో నా పాత్రను చూసాకే అర్థమైంది… నేను కథకు ముఖ్యమేననే భావన లేకపోతే, డైరెక్టర్లు ఎప్పుడైనా నా రోల్‌ని ఎడిటింగ్‌లో తీసేయగలిగితే… ఇలాంటి పాత్రలు ఎందుకు చేయాలి? అప్పుడే నేను తెలుగులో సినిమాలకు గుడ్‌బై చెప్పేశాను” అని చెప్పింది.
ఫ్యాన్స్ రియాక్షన్
ఆమె స్టేట్‌మెంట్ విన్న తర్వాత చాలామంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో స్పందిస్తూ –
“కమలినీ లాంటి టాలెంటెడ్ యాక్ట్రెస్‌కి ఇలాంటివి జరగకూడదు”
“మళ్లీ టాలీవుడ్‌లో రీ-ఎంట్రీ ఇవ్వాలి”
“ఇండస్ట్రీలో హీరోయిన్ రోల్స్‌కి విలువ తగ్గిపోవడమే ఇలాంటి టాలెంట్ లు దూరంగా ఉండటానికి కారణం”
అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఏదైమైనా కమలినీ ముకర్జీ చెప్పిన మాటలు ఒక్క విషయం క్లియర్ చేశాయి –
పాత్రకి విలువ లేని చోట తాను ఉండలేమని, అందుకే టాలీవుడ్‌కి గుడ్‌బై చెప్పేసిందని.