ఇటీవలే కంగనా నటించిన ఎమర్జెన్సీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా థియేటర్‌లలో పెద్దగా ఆధరణ సొంతం చేసుకోలేక పోయింది. దేశవ్యాప్తంగా విడుదలైన ఆ సినిమా దారుణమైన వసూళ్లు నమోదు చేసింది. గతంలో కంగనా చేసిన సినిమాల వసూళ్లతో పోల్చితే ఎమర్జెన్సీ సినిమా వసూళ్లు చాలా చాలా తక్కువ.

కానీ ఓటీటీ వేదికగా ఈ సినిమాకు మంచి స్పందన వచ్చిందని ఆమె అంటోంది. అందుకు సంభందించిన స్క్రీన్ షాట్స్ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. ఎంతో మంది సోషల్‌ మీడియా ద్వారా కంగనాను ప్రశంసిస్తూ సినిమా గురించి కామెంట్‌ చేస్తున్నారని చెప్తోంది.

ఈ సినిమా ఆస్కార్‌కి వెళ్లాలి అని కూడా ఒకరు పేర్కొన్నారు. ఈ పోస్ట్‌లపై నటి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో స్పందించింది. ఆమె సినిమాతో పాటు ఆమె నటనను ప్రశంసిస్తూ పలు పోస్ట్‌లు వచ్చాయి.

ఈ సినిమా ఆస్కార్‌కి ఎలా వెళ్లాలి అనే దాని గురించి, ఒక వ్యక్తి ఇలా వ్రాశాడు, “#EmergencyOnNetflix భారతదేశం నుండి ఆస్కార్ కోసం వెళ్ళాలి.

దీనికి రనౌత్ స్పందిస్తూ, “అయితే అమెరికా తన అసలు ముఖాన్ని గుర్తించడానికి ఇష్టపడదు, వారు అభివృద్ధి చెందుతున్న దేశాలను అణిచివేసారు, చేతులు దులుపుకుంటారు. ఇది #ఎమర్జెన్సీలో బహిర్గతమైంది. వారు తమ వెర్రి ఆస్కార్‌ను ఉంచుకోవచ్చు. మాకు జాతీయ అవార్డులు ఉన్నాయి అంటూ రాసుకొచ్చింది. ఇది చూసిన చాలా మంది ఈ సినిమా ఆస్కార్ కు వెళ్లటం ఏమిటని నవ్వుతూ, వెటకారం చేస్తున్నారు.

,
You may also like
Latest Posts from