కన్నడలో సూపర్ హిట్‌గా నిలిచి తెలుగులోనూ విడుదలై విజయాన్ని సొంతం చేసుకుంది ‘సు ఫ్రమ్ సో’. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని సినీ ప్రియులు వేచి చూశారు. మొత్తానికి “Su From So” చివరికి OTTకి వస్తోంది. కన్నడలో సూపర్ హిట్‌గా దూసుకెళ్లిన ఈ మూవీకి అన్ని భాషల్లోనూ పాజిటివ్ టాక్ రాగా, ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో సెప్టెంబర్ 9 నుంచి స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతోంది. అదీ తెలుగు, మలయాళం, కన్నడలో!
జేపీ తుమినాడ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసింది. స్టోరీలో హీరో అశోకకు అనుకోకుండా ఒక మహిళ ఆత్మ (సులోచన) అతనిలోకి ఎంటరౌతుంది. అలా మొదలైన ట్రాక్ కేవలం గోస్ట్ స్టోరీ కాదు… సమాజానికి స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చే ఎంటర్‌టైనర్ గా ముగుస్తుంది.
స్టోరీ ఏమంటే…
కర్ణాటకలోని ధర్మస్థలి ప్రాంత సమీపంలో ఉన్న ఓ ఊరిలో జరిగే కథ ఇది. ఆ ఊళ్లో ఉండే అశోక్ (జె.పి. తుమినాడ్) ఓ పెళ్లి నుంచి తిరిగి వెళ్తూ.. తాను ప్రేమించిన అమ్మాయి ఇంటి దగ్గర ఆగుతాడు. సరిగ్గా అప్పుడే ఆ ఇంటి బాత్రూంలో నుంచి ఆ అమ్మాయి మాట వినిపించడంతో దొంగతనంగా ఆమెను చూసే ప్రయత్నం చేస్తాడు. అయితే, అశోక్‌ను గమనించిన ఇద్దరు వ్యక్తులు అతడిని పట్టుకోగా.. తనకు దయ్యం పట్టినట్లు డ్రామా ఆడి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ, తెల్లవారే సరికి అశోక్‌కు దయ్యం పట్టిందన్న విషయం ఊళ్లో వైరలైపోతుంది.
అతనిలో ఉన్న ఆ దయ్యాన్ని వదిలించేందుకు ఊరి పెద్ద రవన్న (షానిల్ గౌతమ్) సిటీ నుంచి కరుణాజీ స్వామీజీ (రాజ్ బి శెట్టి)ని తీసుకొస్తాడు. నిజంగానే అశోక్‌ని దయ్యం ఆవహించిందా? దాన్ని కరుణాజీ వదిలించాడా? దయ్యం పట్టినట్లు చేసిన హంగామా వల్ల ఊరంతా ఎలా ఇబ్బంది పడింది? అన్నదే కథ.
థియేటర్స్‌లో మిస్ అయ్యారా? ఇక మిగతా వాళ్లతో ముచ్చట పెడుతూ చూడొచ్చు.
సెప్టెంబర్ 9న, హాట్‌స్టార్‌లో—సిద్ధంగా ఉండండి!