కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కెఎఫ్‌సిసి) ప్రముఖ ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫాం బుక్ మై షోకి లేఖ రాసింది. ఆ సంస్దకు షాక్ ఇచ్చే కొన్ని డిమాండ్లను ఛాంబర్ సమర్పించింది.

పారదర్శకత , న్యాయబద్ధతను నిర్ధారించడానికి, నకిలీ లేదా చెల్లింపులను నిరోధించడానికి చర్యలు తీసుకోవాలని ఛాంబర్ కోరింది.
ఆ డిమాండ్స్ ఇవే:

రెవిన్యూ షేరింగ్: కన్నడ చలనచిత్రాల నుండి వచ్చే ఆదాయంలో సరసమైన శాతాన్ని (50-75%) నిర్మాతలు లేదా అధీకృత పంపిణీదారులతో (మరియు ఎగ్జిబిటర్‌లతో కాదు) షేర్ చేసుకోండి, ఏమైనా సమస్యలు ఉంటే సామరస్యపూర్వక చర్చల ద్వారా నిర్ణయించబడుతుంది.

ప్రోటోకాల్ ఫర్మిషన్: కన్నడ చిత్రాలకు టిక్కెట్ బుకింగ్‌లను సులభతరం చేయడానికి ముందు నిర్మాతలు లేదా అఫీషియల్ డిస్ట్రిబ్యూటర్స్ నుండి స్పష్టమైన అనుమతి పొందే విధానాన్ని అమలు చేయండి.

ఆదాయంలో పారదర్శకత: టికెట్ బుకింగ్ రుసుము ప్రారంభించినప్పటి నుండి కన్నడ చిత్రాల నుండి వచ్చిన ఆదాయాన్ని వెల్లడించండి మరియు వివరణాత్మక రిపోర్ట్ లు అందించండి.

రేటింగ్ సిస్టమ్ తాత్కాలిక సస్పెన్షన్: కన్నడ చిత్రాలకు ఈ లేఖ అందిన వెంటనే దాని ప్రామాణికతను నిర్ధారించడానికి దిద్దుబాటు చర్యలు అమలయ్యే వరకు రేటింగ్ వ్యవస్థను నిలిపివేయండి.

,
You may also like
Latest Posts from