సినిమా వార్తలు

కీర్తి సురేష్‌కు భారీ అవమానం! ఇంత దారుణమా?

నేషనల్ అవార్డ్ నటిగా వెలుగొందిన కీర్తి సురేష్‌కి ఇటీవల ఏ భాషలోనూ సక్సెస్ పట్టడం లేదు. తెలుగు సినిమాలైతే ఒకటేంటే ఒకటి కూడా లైన్‌లో లేవు. మిగతా భాషలలో చేసిన చిత్రాలు డబ్బింగ్‌గా వచ్చి పోతున్నాయి.

ఆ మధ్య ఎలాంటి హిట్ లేకపోవడంతో కీర్తి చాలా ఆశలు పెట్టుకుంది ‘రివాల్వర్ రీటా’ మీద. క్రైమ్ కామెడీ జానర్‌లో, ఆమెనే లీడ్‌గా వచ్చిన ఈ సినిమా నేడు రిలీజ్ అయ్యింది. కానీ విడుదలైన రోజు ఉదయం నుంచే షాకింగ్ సన్నివేశం…

ఉదయం షోలు క్యాన్సిల్ – ఆడియన్స్ లేరు!

తెలుగు రాష్ట్రాల్లో సినిమా పట్ల కనీస ఆసక్తి కూడా కనిపించలేదు. హాళ్లవద్ద కత్తెర కట్టే పరిస్థితి. ప్రేక్షకులు రాకపోవడంతో చాలా చోట్ల మార్నింగ్ షోలు క్యాన్సిల్ అయ్యాయి.

మహానటి తర్వాత కీర్తి కెరీర్ డౌన్ హిల్

‘మహానటి’ తర్వాత కీర్తి సురేష్ చేసిన సినిమాల్లో ఒక్కటీ సక్సెస్ కాలేదు. తెలుగు మార్కెట్‌లో ఆమె థియేట్రికల్, నాన్-థియేట్రికల్ వ్యాల్యూ రెండూ రాక్ బాటమ్ కి చేరిపోయాయి. అలాంటప్పుడు, పెద్ద ప్రమోషన్‌లు లేకుండా ‘రివాల్వర్ రీటా’ థియేటర్లకు వచ్చింది. ఫలితం?

అవుట్‌రైట్ డిజాస్టర్!

క్రైమ్ కామెడీ అని చెప్పినప్పటికీ, నవ్వులు రావు. కథ సిల్లీగా ఉంది.ఎగ్జిక్యూషన్ బాదుగా ఉంది అని ప్రేక్షకులు, విమర్శకులు నిలువునా తిరస్కరించారు. తెలుగు, తమిళంతో పాటు ఎక్కడా సినిమా వర్కవుట్ కాలేదు.

నటీనటులూ ఉన్నా పనికిరాలేదు

జేకే చంద్రు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాధిక శరత్‌కుమార్, సునీల్, రెడిన్ కింగ్‌స్లే, మైమ్ గోపీ లాంటి నటులు ఉన్నా కూడా సినిమా నిలబడలేదు.

మొత్తంగా… కీర్తి సురేష్‌కు ఇదొక పెద్ద అవమానం!

‘రివాల్వర్ రీటా’తో కీర్తి బలమైన కమ్‌బ్యాక్ కోరుకుంది. కానీ విడుదల రోజే సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో, ఆమె కెరీర్‌కు ఇది మరొక కఠిన దెబ్బగా మారింది.

Similar Posts