కల్యాణి ప్రియదర్శన్, నస్లెన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘కొత్త లోక’. ఈ చిత్రానికి డామినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫస్ట్ ఎపిసోడ్ ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’ పేరుతో ఆగస్టు 30న థియేటర్లలో విడుదల అయ్యింది. దుల్కర్ సల్మాన్ తో ఉన్న అనుబంధం కారణంగా ఈ సినిమాను తెలుగులో సూర్యదేవర నాగవంశీ విడుదల చేశారు. టెక్నికల్ గా బాగున్న ఈ చిత్రాన్ని రెగ్యులర్ మూవీ లవర్స్ కు బాగా నచ్చుతోంది.
మలయాళంలో ఇప్పటికే బ్లాక్‌బస్టర్ అయిపోయిన ఈ చిత్రం, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నాగ వంశీ చేతుల మీదుగా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రచారం తక్కువే కానీ ఓపినింగ్స్ మాత్రం బాగున్నాయి. థియేటర్‌లో మొదటి షో నుంచే వాతావరణం మారిపోయింది.
ఫస్ట్ హాఫ్‌లో జానపద మైథ్ వండర్స్, సెకండ్ హాఫ్‌లో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ – ఆడియన్స్ మైండ్ బ్లో అయ్యారు.
సోషల్ మీడియాలో రివ్యూలు ఫ్లడ్ అవుతున్నాయి. “ఇది కేవలం సినిమా కాదు, ఒక అనుభవం” అంటున్నారు యూత్. బుక్ మై షోలో అవర్‌లీ ట్రెండింగ్‌లో నంబర్ వన్‌గా దూసుకుపోతున్న ఈ మూవీ – రేపటికి కూడా హౌస్‌ఫుల్ బుకింగ్స్ దక్కించుకుంటోంది.
అయితే సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్లాక్‌బస్టర్ల జాబితాలో ఇప్పుడు ‘కొత్త లోక’ కూడా చేరుతుందా లేదా అనేది వీకెండ్ అయితే కానీ తేలదు. వుమన్ సెంట్రిక్ సూపర్ హీరో ఫిల్మ్‌కి తెలుగు ఆడియన్స్ ఇచ్చిన రెస్పాన్స్ – టాలీవుడ్‌లో కొత్త మార్గం చూపిస్తోందనే చెప్పాలి.