పాన్ ఇండియా లెవెల్‌లో పెద్ద పెద్ద స్టార్‌లతో సినిమాలు చేయాలనే కలలతో ఉన్న టాప్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌కి, ఇటీవల వచ్చిన ‘కూలీ’ ఫ్లాప్ పెద్ద షాక్ ఇచ్చింది. ఆ సినిమా ఫలితం వల్ల ఆయన ప్లాన్ చేసిన ప్రాజెక్టులు కూడా ఒక్కొక్కటిగా డిలే అవుతున్నాయి.

ఆమీర్ ఖాన్ తో సూపర్ హీరో సినిమా, అలాగే రజనీకాంత్–కమల్ హాసన్ మల్టీ స్టారర్ చేయాలనుకున్న లోకేష్ ప్లాన్స్ ప్రస్తుతం హోల్డ్‌లోకి వెళ్లిపోయాయి. ఆమీర్ సినిమా పూర్తిగా షెల్వ్ కాగా, రజనీ–కమల్ మూవీ డిలే అయింది.

ఇప్పుడు లోకేష్ తిరిగి తన రూట్స్‌కి వెళ్తున్నారు. తాజా సమాచారం ప్రకారం — ఆయన కార్తీతో కలిసి ‘ఖైది 2’ చేయబోతున్నారని తమిళ వర్గాలు ధృవీకరించాయి. ఇదే లోకేష్ తదుపరి ప్రాజెక్ట్‌గా ఫైనల్ అయ్యింది.

ప్రస్తుతం ఫైనల్ డ్రాఫ్ట్ రాయడం స్టార్ట్ చేశారట, ప్రీ–ప్రొడక్షన్ కూడా మొదలైందట. కార్తీ తన ప్రస్తుత సినిమా పూర్తయిన వెంటనే ‘ఖైది 2’ సెట్స్‌లోకి వెళ్తారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించనుంది.

అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఈ ఏడాది చివర్లో రావొచ్చని టాలీవుడ్–కొలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాక్!

, , ,
You may also like
Latest Posts from