పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘దే కాల్ హిమ్ ఓజీ’ తో బాక్సాఫీస్‌ను ఊపేస్తున్నాడు. ఆరంభం నుంచి హౌస్‌ఫుల్ షోస్, ఫ్యాన్స్ ఫ్రెంజీ, రికార్డు స్థాయి కలెక్షన్స్‌తో ఓజీ టాలీవుడ్‌లో సెన్సేషన్‌గా మారింది. ఇంత క్రేజ్‌కి సాక్ష్యంగా, తమిళంలో లవ్ టుడే మూవీతో ఒక్కసారిగా పాపులర్ అయిన యంగ్ హీరో హైదరాబాద్‌కి వచ్చేసి సర్ప్రైజ్ ఇచ్చాడు.

ఆ హీరో ఎవరో తెలుసా?

లవ్ టుడేతో హిట్ కొట్టిన యాక్టర్-డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్. తాజాగా హైదరాబాద్‌కి వచ్చి, పవన్ కళ్యాణ్ అభిమానులతో కలసి విమల్ థియేటర్‌లో ఓజీ చూసేశాడు. అంతే కాదు… తెలుగు లోనే స్పెషల్‌గా పోస్ట్ చేయడం ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చింది.

థియేటర్‌లో అభిమానులతో కలిసి పవర్‌ఫుల్ సీన్స్ ఎంజాయ్ చేసిన ప్రదీప్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వర్క్ ఫ్రంట్‌లో ప్రదీప్ రాబోయే మూవీ ‘డ్యూడ్’ అక్టోబర్ 17న రిలీజ్ అవుతుంది. అదీ కాకుండా, LIK – Love Insurance Kompany అనే కొత్త ప్రాజెక్ట్ కూడా లైన్లో పెట్టాడు.

పవన్ కళ్యాణ్ క్రేజ్ అంతా ఇంతా కాదు అన్నట్టే… ప్రదీప్ లాంటి ఇతర ఇండస్ట్రీ హీరోలు కూడా ఓజీ కోసం హైదరాబాద్ థియేటర్‌కి రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

, , , , ,
You may also like
Latest Posts from