సినిమాలను మనుషులు కాకుండా మిషిన్లు తీయగల రోజులు వచ్చినట్టే ఉన్నాయి. సినిమా ప్రపంచం మరో మైలురాయికి చేరుకుంది. కన్నడ దర్శకుడు నరసింహ మూర్తి “లవ్ యూ” అనే సినిమాతో ప్రపంచంలోనే తొలి AI-జెనరేటెడ్ ఫీచర్ ఫిల్మ్ అనే కొత్త ట్రెండ్‌ను సృష్టించబోతున్నారు.

ఒక డైరెక్టర్ – ఒక టెక్నిషియన్ – 30 AI టూల్స్

30 AI టూల్స్, ₹10 లక్షల ఖర్చుతో సిద్దమైన ఈ సినిమా సర్వ సాధారణ ప్రయత్నం కాదు. ఈ సినిమాకు మానవీయమైన భాగం కేవలం ఇద్దరే – డైరెక్టర్ నరసింహ మూర్తి, AI టెక్నిషియన్ నూతన్. మిగిలినంత మొత్తం మెషీన్ లే!

₹10 లక్షల ఖర్చుతో, 6 నెలల పని

ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు 30కి పైగా AI టూల్స్ను లైసెన్స్ చేసుకున్నారు. అందులోని సాఫ్ట్‌వేర్ ఖర్చు మాత్రమే దాదాపు రూ. 10 లక్షల వరకు వెచ్చించారు. ఇందులో 12 పాటలు కూడా ఉన్నాయి.

ఈ ప్రయోగాత్మక సినిమా ఒకే ఒక్క స్క్రీన్‌పై ప్రీమియర్ చేయడానికి సిద్ధమవుతున్నారు, రికార్డ్ కోసం!

“ఒక వినూత్న ప్రయోగం… కానీ పరిమితులున్నాయ్!”

డైరెక్టర్ మూర్తి ఓపెన్ గా ఒప్పుకున్నారు – ఈ సినిమాకి కొన్ని పరిమితులు ఉన్నాయి. ముఖ్యంగా కేరెక్టర్ ఫీచర్స్ కొన్ని సన్నివేశాల్లో కంటిన్యుటి లేకుండా మారిపోవడం, ఎమోషనల్ ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడంలో చాంలెంజ్‌లు ఉండటం, లిప్‌సింక్ లోపాలు ఉండటం వంటి ఇబ్బందులున్నాయని తెలిపారు.

అంతేకాదు, ప్రాంతీయ సెన్సార్ బోర్డు అధికారులు కూడా సీన్స్‌లో కన్సిస్టెన్సీ లేకపోవడాన్ని పాయింట్‌ ఔట్ చేశారని చెప్పారు.

“మేము వాడిన టూల్స్ ఇప్పటికే అవుట్‌డేటెడ్ అయ్యాయ్!”

AI టెక్నిషియన్ నూతన్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. “మేము వాడిన టూల్స్‌తో సినిమా పూర్తయ్యేలోపే, అవే టూల్స్ మార్కెట్‌లో వెనుకబడిపోయాయి. AI వేగం అంతే!” అంటూ చెప్పుకొచ్చాడు.

ఇదొక సినీ విప్లవానికి నాంది కావొచ్చా?

ఈ ప్రయోగం ద్వారా సినిమా ఎక్కడికి పోతుంది? అన్న పెద్ద ప్రశ్న తలెత్తుతోంది. మనుషుల భావోద్వేగాలను, నటనను, కథ చెప్పే తీరును AI రీప్లికేట్ చేయగలదా? లేక అది ఒక్క టెక్నికల్ ఎక్స్‌పెరిమెంట్‌గానే మిగిలిపోతుందా?

అయితే ఓ విషయం మాత్రం ఖాయం – “లవ్ యూ” సినిమాతో నరసింహ మూర్తి ప్రపంచ సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయారు. ఈ ప్రయోగం విజయవంతమవుతుందో లేదో చూడాలి కానీ, భవిష్యత్ సినిమాల ఊపిరిలో AI భాగం అవుతుందనేది మాత్రం నమ్మితీరాల్సిన నిజం!

You may also like
Latest Posts from