‘మ్యాడ్’తో హిట్ కొట్టిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ తాజాగా దీని సీక్వెల్‌తో పలకరించారు. ‘మ్యాడ్ స్క్వేర్’ (MAD Square) అంటూ ప్రేక్షకుల ముందుకువచ్చి మరోసారి సక్సెస్ అందుకున్నారు. మార్చి 28న విడుదలైన ఈ సినిమా ఓవర్సీస్‌లోనూ హవా చూపిస్తోంది. రివ్యూలు తేడాగా ఉన్నా సినిమా బాగానే వర్కవుట్ అవుతోందని నిర్మాత అంటున్నారు.
నిర్మాణ సంస్ద చెప్పిన లెక్కలు ప్రకారం… తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా గట్టి వసూళ్లు అందుకుందీ ఈ చిత్రం. ఇపుడు కేవలం 4 రోజుల్లోనే చాలా చోట్ల బ్రేకీవెన్ కొట్టేసినట్టు నిర్మాత నాగ వంశీ చెబుతున్నారు.
అలాగే మరికొన్ని చోట్ల ఆల్రెడీ 90 శాతం టార్గెట్ కూడా రీచ్ అయ్యిపోయిందని అంటున్నారు. దీనితో మ్యాడ్ స్క్వేర్ పట్ల తాను ఆనందం వ్యక్తం చేశారు.
ఇదే క్రమంలో సినిమా టికెట్ ధరలపై కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎక్కువ సినిమాలు పోటీ కారణంగా ధరలు పెంచాల్సి వచ్చింది అని నేటి నుంచి సాధారణ ధరకే టికెట్స్ ఉంటాయని తాను కన్ఫర్మ్ చేశారు.