పోస్టర్ నుంచే ఆడియన్స్ దృష్టిని ఆకర్షించేలా డిజైన్ చేసిన ‘మహాకాళి’ చిత్రం, తన కథ ఎలిమెంట్స్‌తోనే ప్రత్యేకంగా నిలిచింది. ఈ కొత్త పోస్టర్‌లో, కాళీ దేవిని అనుసంధానించిన బెంగాల్ ప్రాంతం, అక్కడి సాంస్కృతిక విలువలు, హౌరా బ్రిడ్జ్‌లు తదితర ముఖ్యాంశాలతో సుసంపన్నమైన విజువల్స్ చూపించడం ద్వారా సినిమా కథకు సంబంధించిన సిగ్నిఫికెన్స్‌ను మానవీయంగా అందించారు.
ప్రేక్షకుల ఆసక్తిని సొంతం చేసుకునేలా, ఈ పోస్టర్ ఒక్కటే ‘మహాకాళి’ యూనివర్స్‌ను ఫీచర్ చేస్తూ, అదృష్టం, దైవం, ఆధ్యాత్మికత, మహిళా స్ఫూర్తి అన్ని అంశాలను పటుత్వంగా చూపిస్తుంది. ఇది సినిమాలోని అద్భుతమైన కథనాన్ని ముందుకు తీసుకెళ్లి, భవిష్యత్తులో ప్రేక్షకుల మధనంలో ఓ మారు నిలిచేలా చేస్తుంది.
‘హనుమాన్’ (Hanu-Man) సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma). ఆ సినిమా సాధించిన విజయంతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్ష్ పై వరుసగా సినిమాలు నిర్మిస్తామని తెలిపాడు. కేవలం తన దర్శకత్వంలోనే కాకుండా ఇతరుల దర్శకత్వంలోనూ ఈ యూనివర్స్ లో సినిమాలు ఉంటాయని చెప్పాడు.
ఇప్పటికే ‘జై హనుమాన్’ (Jai Hanuman) ను స్వీయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) తో కలిసి నిర్మిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. అలానే పూజ అపర్ణ కొల్లూరు (Puja Aparna Kolluru) దర్శకత్వంలో ఆర్.కె.డి. స్టూడియ్స్ రివాజ్ రమేశ్ దుగ్గల్ తో కలిసి ‘మహా కాళీ’ (Mahakali) మూవీని ఇప్పటికే ప్రశాంత్ వర్మ ప్రకటించాడు. ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మే 12న నిరాడంబరంగా ప్రారంభించారు.
ఈ విషయాన్ని ప్రశాంత్ వర్మ ఎక్స్ వేదికగా తెలిపారు. దీనికి నిర్మాణ భాగస్వామిగా ఉండటంతో పాటు ప్రశాంత్ వర్మ కథ, కథనం అందిస్తున్నారు. ఆధ్యాత్మిక, పౌరాణిక అంశాలతో మిళితమై ఈ సినిమా ఉండబోతోంది. ఇది భారతదేశంలోనే ఫస్ట్ ఫిమేల్ సూపర్ హీరో, యూనివర్స్ లో మోస్ట్ ఫెరోషియస్ సూపర్ హీరో (Super Hero) మూవీ అవుతుందని మేకర్స్ చెబుతున్నారు.