సినిమా వార్తలు

పాకిస్తాన్‌లో ‘మహావతార్ నరసింహా’ హవా మామూలుగా లేదు!

భారత బాక్సాఫీస్‌ దగ్గర 300 కోట్ల మార్క్ దాటుతూ సంచలనంగా నిలిచిన యానిమేటెడ్ డివోషనల్ మూవీ మహావతార్ నరసింహా ఇప్పుడు మరో అద్బుత ఘట్టాన్ని ఆవిష్కరించింది. స్టార్ హీరోల ప్రమోషన్లు లేకుండా, నిశ్శబ్దంగా రిలీజ్ అయి, భారత సినీ చరిత్రలో షాకింగ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తన యాత్రను కొనసాగిస్తోంది.

పాకిస్తాన్‌లో ‘మహావతార్ నరసింహా’ స్క్రీనింగ్ — ఊహించని ట్విస్ట్!

ఇండియా అంతటా అద్భుతమైన స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం తాజాగా పాకిస్తాన్‌లో ప్రదర్శించబడింది. అవును—కరాచీలోని స్వామినారాయణ మందిర్‌లో “మహావతార్ నరసింహా” మొదటిసారిగా స్క్రీన్ అయింది. అక్కడ అద్బుతమైన రెస్పాన్స్ రావటంతో పాకిస్దాన్ లో చాలా చోట్ల స్క్రీనింగ్ గా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

యానిమేషన్ సినిమా 300 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశిస్తుందని ఎవరూ ఊహించని సమయంలో మహావతార్ నరసింహా అద్భుతాలు చేసింది. హిందీ, తెలుగు మార్కెట్‌ల్లో కూడా భారీ రేంజ్‌లో కలెక్షన్లు రాబట్టి పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ స్థాయిలో నిలిచింది.

ఓటీటీలో మరింత రీచ్ – ఆపై ఆస్కార్ బరిలోకి!

నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన తర్వాత ఈ మూవీ వ్యాప్తి మరింత పెరిగింది. అంతర్జాతీయ ప్రేక్షకుల్లోను పెద్ద హంగామా చేసింది. తాజాగా 98వ ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్ రౌండ్‌కు కూడా అర్హత సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇలాంటి మోమెంటమ్ మధ్య పాకిస్తాన్‌లో స్క్రీనింగ్ జరగడం విశేషమే కాకుండా, ఇది క్రాస్ బోర్డర్ కల్చరల్ కనెక్షన్‌ను కూడా సూచిస్తోంది.

మహావతార్ సినిమా యూనివర్స్ – మొదటి అధ్యాయం మాత్రమే!

అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని క్లీమ్ ప్రొడక్షన్స్ నిర్మించగా, KGF, కాంతార వంటి బ్లాక్‌బస్టర్లను ప్రపంచానికి అందించిన హోంబాలే ఫిల్మ్స్ ప్రెజెంట్ చేసింది. ఇది మొత్తం ఏడు భాగాలుగా రూపొందనున్న మహావతార్ సినిమాటిక్ యూనివర్స్లో తొలి చిత్రమే.

ఇంకా ప్రయాణం మొదలే!

భారత బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశమవుతోంది. “మహావతార్ నరసింహా” పాకిస్తాన్‌లో స్క్రీన్ అవడం ఒక అరుదైన ఘట్టం. ఇక ఆస్కార్ నామినేషన్ జాబితా రానున్న నేపథ్యంలో— ఈ యానిమేటెడ్ ఇండియన్ ఎపిక్ మరింత పెద్ద విజయం దిశగా పయనిస్తుందా? అన్నది చూడాల్సిందే… కానీ జోష్ మాత్రం స్ట్రాంగ్‌గా ఉంది!

ఇంకా మరిన్ని అప్‌డేట్స్ కోసం వెయిట్ అండ్ వాచ్!

Similar Posts