ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్‌-వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ ‘గ్లోబ్ ట్రాట్టర్’ షూటింగ్ ఫైనల్ ఫేజ్‌లోకి దూసుకెళ్లింది. మహేశ్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా, మలయాళ సూపర్‌స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ భారీ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూట్ అవుతోంది. అలాగే ఈ నెల‌ 15న ‘గ్లోబ్ ట్రాటర్’ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు.

ఈ మేరకు రాజమౌళి తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. “ప్రస్తుతం ముగ్గురు ప్రధాన నటులతో క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. దీంతో పాటు ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్ కోసం కూడా భారీగా సన్నాహాలు చేస్తున్నాం. గతంలో మేము చేసిన దానికంటే ఇది చాలా భిన్నంగా, కొత్తగా ఉండబోతోంది. ఈ నెల‌ 15న మీ అంద‌రికీ ఇది క‌చ్చితంగా గొప్ప అనుభూతిని పంచుతుంది” అని రాజమౌళి పేర్కొన్నారు. ఈ ఈవెంట్‌కు ముందుగా ఈ రోజు పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నట్లు కూడా ఆయన తెలిపారు.

ఇదిలా ఉంటే.. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా అప్‌డేట్ కోసం మహేశ్ బాబు, రాజమౌళి మధ్య సోషల్ మీడియాలో ఓ సరదా సంభాషణ జరిగింది. ఈ నెల‌ 1న మహేశ్ ‘నవంబర్ వచ్చేసింది రాజమౌళి గారు’ అని ట్వీట్ చేయగా, దానికి జక్కన్న ‘అవును.. ఈ నెలలో ఏ సినిమాకి రివ్యూ ఇద్దాం అనుకుంటున్నావు?’ అంటూ సరదాగా బదులిచ్చారు. దీనికి మహేశ్ స్పందిస్తూ.. ‘మీరు ఎప్పటికీ తీస్తూనే ఉండే మహాభారతం గురించి సార్.. ముందుగా నవంబర్‌లో ఏదో ఇస్తానని మాటిచ్చారు, ఆ మాట నిలబెట్టుకోండి’ అన్నారు.

రాజమౌళి మేజిక్, మహేశ్ బాబు గ్లోబల్ లుక్, ప్రియాంక చోప్రా గ్లామర్, పృథ్విరాజ్ ఇన్‌టెన్సిటీ – ఈ కాంబినేషన్ ఎలాంటి తుఫాన్ సృష్టిస్తుందో చూడాలి మరి!

, , , , ,
You may also like
Latest Posts from ChalanaChitram.com