కొన్ని సినిమాలు చిత్రమైన రికార్డ్ లు క్రియేట్ చేస్తూంటాయి. ముఖ్యంగా టీవీల్లో జనాలకు తెగ నచ్చి చూసిన సినిమా ఏది అంటే తెలుగువారు చెప్పేది అతడు సినిమా. థియేటర్లలలో పెద్దగా వర్కవుట్ కాకపోయినా టీవీల్లో ఈ సినిమా రికార్డ్ లు క్రియేట్ చేసింది.

దాదాపు 20 ఏళ్ళ క్రితం విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు ‘అతడు’ మూవీ సరికొత్త రికార్డు సృష్టించింది. టెలివిజన్ లో 1500 సార్లు టెలికాస్ట్ అయిన సినిమాగా ఘనతను సాధించింది. భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా టీవీలో ఇన్ని సార్లు టెలికాస్ట్ అయిన తొలి సినిమా ఇదే కావటం విశేషం.

2005 లో త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేష్, త్రిష జంటగా నటించారు. ముఖ్యంగా ఈ సినిమాలో మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ మాయచేశాయి.

“నిజం చెప్పే ధైర్యం లేని వాడికి అబద్ధం చెప్పే హక్కు లేదు. నిజం చెప్పకపోవటం అబద్దం.. అబద్దాన్ని నిజం చేయాలనుకోవడం మోసం” ఇలాంటి అనేక డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

, ,
You may also like
Latest Posts from