తనే హీరోయినిగా, నిర్మాతగా తీసుకొస్తున్న మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘దక్ష’ ఈ నెల 19న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్లతో బిజీగా ఉన్న మంచు లక్ష్మీ, ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని ఎప్పుడూ వినని విషయాలు బయటపెట్టింది.

“కొంతకాలంగా నేను ముంబైలోనే ఉంటున్నా. రానా, చరణ్, సూర్య — వాళ్లందరూ ముందే అక్కడ సెట్ అయిపోయారు. నాకు కూడా రానా మార్గదర్శి. ముంబై లైఫ్ స్టైల్‌నే ఇష్టపడతాను. రెంట్ హౌస్‌లో ఉంటున్నా… తాప్సీ, రకుల్‌లతో కలుసుకుంటూ ఉంటా. ఎక్కడ ఉన్నా నేను చూసి ఇతరులు ధైర్యం తెచ్చుకోవాలి కానీ… పిరికిగా బ్రతకమని చెప్పను,” అని ఆమె చెప్పింది.

అయితే అందరినీ షాక్‌కు గురి చేసినది ఆర్ధిక విషయమే.

“ఇల్లు అమ్మేశానన్న రూమర్స్ విన్నా. కానీ నాకు ఎప్పటినుంచీ సొంత ఇల్లే లేదు! ఫిల్మ్‌నగర్‌లో ఉన్నది నాన్న ఇల్లు మాత్రమే. ఆ ఇంటికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నిజం చెప్పాలంటే, అవును… నేను ఆర్ధికంగా ఇబ్బందుల్లోనే ఉన్నా. కానీ ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో నేర్చుకోవాలని పట్టుదలతో ఉన్నాను,” అని మంచు లక్ష్మీ తన మనసు విప్పేసింది.

ఇప్పుడు థియేటర్లలో అన్నీ హిట్ సినిమాలే నడుస్తున్నాయి. సెప్టెంబర్ 5న వచ్చిన లిటిల్ హార్ట్స్ ఇప్పటికీ థియేటర్లలో ఆడుతోంది. ఇక 12న వచ్చిన తేజసజ్జ మిరాయ్ సినిమా దుమ్ములేపుతోంది. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో థియేటర్లను కమ్మేసింది. ఎక్కడ చూసినా భారీగా ప్రేక్షకులతో థియేటర్లలు నిండిపోతున్నాయి.

ఇక అన్నింటికీ మించి సెప్టెంబర్ 25న పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ ఓజీ మూవీ వస్తోంది. ఇలాంటి టైమ్ లో ఎవరూ తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు రిస్క్ చేయరు. కానీ మంచు లక్ష్మీ మాత్రం తన దక్ష మూవీని సెప్టెంబర్ 19న రిలీజ్ చేస్తోంది. ఇది చూసిన వారందరికీ ఒకింత ఆశ్చర్యంగానే అనిపిస్తోంది. అనవసరంగా ఆమె రిస్క్ చేస్తుందా అనుకుంటున్నారు.

, , ,
You may also like
Latest Posts from