మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ విడుదలకు సిద్ధమవుతుండగా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. సినిమాలో బ్రహ్మానందం, సప్తగిరి పోషించిన పిలక, గిలక పాత్రలపై బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పాత్రలు తమ మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని, సినిమా విడుదలను అడ్డుకుంటామని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా నిరసన తెలిపారు. గతంలోనూ మంచు కుటుంబం బ్రాహ్మణులను కించపరిచేలా వ్యవహరించిందని ఆరోపించారు. ఈ వివాదంపై మంచు విష్ణు స్పష్టత ఇచ్చారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా సినిమాను తీర్చిదిద్దామని అన్నారు. ఈ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. హిందూ సంప్రదాయాలను గౌరవిస్తూ, ఆ పరమశివుడిని భక్తితో చూపించామని అన్నారు.

మంచు విష్ణు మాట్లాడుతూ…. ‘ప్రతి రోజూ సన్నివేశాలను తెరకెక్కించే ముందు భక్తితో పూజించి, వేద పండితుల ఆశీర్వచనం తీసుకునేవాళ్లం. స్క్రిప్ట్‌ దశలోనే వేదాధ్యయనం చేసిన వారితో పాటు, పలువురు ఆధ్యాత్మిక వేత్తల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించాం. భక్తితత్వాన్ని వ్యాప్తి చేయడమే ‘కన్నప్ప’ తీయడం వెనుక అసలు ఉద్దేశం. అంతేకానీ, వివాదాలు కాదు. సినిమా విడుదలయ్యే వరకూ ప్రతి ఒక్కరూ ఓపికతో ఉండండి. మూవీ విడుదల కాకముందే ఓ నిర్ణయానికి రాకండి’’ అని మంచు విష్ణు విజ్ఞప్తి చేశారు.

#Brahmanandam, #Kajal Aggarwal, #Kannappa, #Manchu Mohan Babu, #Manchu Vishnu, #Mohan Lal

By admin