దక్షిణ భారత సినీ రంగంలో లెజెండరీ డైరెక్టర్‌గాలలో ఒకరుమణిరత్నం. ఆయన తాజాగా కమల్ హాసన్‌తో చేసిన Thug Life వర్కవుట్ కాకపోయినా, ఆయనపై ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అసలే ఆయన సినిమాలు ఎంతటి ఫలితాన్నిచ్చినా, ప్రేక్షకులు, అభిమానులు ఆయన నుంచి వచ్చే కొత్త ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు.

తాజా సమాచారం ప్రకారం, మణిరత్నం – ధ్రువ్ విక్రమ్ కాంబినేషన్‌లో ఓ కొత్త సినిమా సెప్టెంబర్ 2025లో సెట్స్‌ మీదకు వెళ్తుంది. చెన్నై నేపథ్యంలో నడిచే పోలీస్ డ్రామాగా, అందులో రొమాన్స్ ఎలిమెంట్స్‌తో కూడిన కథను మణిరత్నం తన స్టైల్‌లో మలుస్తున్నారని కోలీవుడ్ టాక్. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ నటించనుంది.

సంగీతం విషయానికి వస్తే, మణిరత్నం–ఏఆర్ రెహ్మాన్ కాంబో మళ్లీ రిపీట్ కానుంది. ఈ జోడీ నుంచి ఎప్పుడూ మ్యూజికల్ మ్యాజిక్‌నే ఆశించే ప్రేక్షకులకు ఇది పెద్ద హ్యాపీ న్యూస్. షూటింగ్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి, సినిమా 2026 ఆరంభంలోనే థియేటర్స్‌లోకి వచ్చే అవకాశం ఉంది.

ఫెయిల్యూర్స్ వచ్చినా మణిరత్నం సినిమాలంటే అభిమానుల్లో ఉండే క్రేజ్ మామూలు కాదు. ఆయన పేరు వినగానే థియేటర్స్‌కు వెళ్లడానికి సిద్ధంగా ఉంటారు. అందుకే ఈ కొత్త ప్రాజెక్ట్‌పై ఇప్పటికే హై ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి.

సెప్టెంబర్ 2025లో షూటింగ్ మొదలయ్యే ఈ సినిమా, 2026 ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

, , , , ,
You may also like
Latest Posts from