ఒకప్పుడు రవితేజ సినిమా అంటే టికెట్ కౌంటర్ల దగ్గర జనం క్యూలు.. ఓపెనింగ్స్ లో కలెక్షన్ల వర్షం. కానీ ఇప్పుడు వరుసగా వచ్చిన డిజాస్టర్స్ వల్ల బాక్సాఫీస్ దగ్గర పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అయినా రవితేజ పారితోషికం విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. దాంతో ఆయనకు సినిమాలు సైతం తగ్గాయి. ఆయనతో ముందుకు వెళ్దామనుకున్న నిర్మాతలు సైతం రవితేజ రెమ్యునరేషన్,బిజినెస్ పోల్చి చూసుకుని వెనక్కి తగ్గేవారు. అయితే ఇవన్నీ రవితేజ గమనించారు.
చివరికి మాస్ మహారాజా తన పేమెంట్ మోడల్‌లోనే కాంప్రమైజ్‌కి వచ్చాడు. కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో చేస్తున్న సినిమా కోసం రవితేజ మినిమమ్ రెమ్యునరేషన్ తీసుకుని, మిగతా భాగం ప్రాఫిట్ షేరింగ్ లో సెటిల్ అవుతున్నాడట. ఇదే కాకుండా శివ నిర్వాణ డైరెక్షన్‌లో మైత్రి మూవీ మేకర్స్ తో కూడా ఇలాంటి డీల్ తోనే అగ్రిమెంట్ చేసుకున్నాడు.
ఒకప్పుడు సినిమాలు రిలీజ్ అయ్యేలోపే నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టిన రవితేజ.. ఇప్పుడు లాస్ అవుతున్న మార్కెట్‌లో అడ్జస్ట్ అవుతూ మళ్లీ గేమ్‌లోకి రావడానికి కొత్త ప్లాన్ అమలు చేస్తున్నాడు.
“మాస్ మహారాజా కాంప్రమైజ్ – ఇక్కడి నుంచి ఆయన కెరీర్ ఎలా మలుపు తిరుగుతుంది?” అనేది ఇప్పుడు టాలీవుడ్ టాక్!