యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ – విజువల్ బ్రిలియన్స్ కి పేరుగాంచిన దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ మూవీ “మిరాయ్”, థియేటర్లలో హిట్ టాక్‌తో దూసుకుపోయిన తర్వాత ఇప్పుడు ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేసింది. అయితే… ఈసారి చిన్న ట్విస్ట్‌తో వచ్చింది!

OTT లో మిరాయ్ — కానీ మిస్సింగ్ ఏదో ఉంది!

“మిరాయ్” ఇప్పుడు Jio Hotstar లో స్ట్రీమింగ్ అవుతోంది — తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి వచ్చింది. కానీ ఈ ఓటీటీ వెర్షన్ థియేటర్ వెర్షన్‌కి కాస్త భిన్నంగా ఉంది.

థియేటర్ రన్‌టైమ్ — 2 గంటలు 49 నిమిషాలు
ఓటీటీ రన్‌టైమ్ — 2 గంటలు 46 నిమిషాలు

అంటే 3 నిమిషాలు తగ్గించబడింది!
మరింత షాకింగ్ ఏమిటంటే, థియేటర్స్ లో తర్వాత యాడ్ చేసిన హిట్ సాంగ్ “వైబ్ ఉంది బేబి” ఈ డిజిటల్ వెర్షన్‌లో కనపడటం లేదు!

నిధి అగర్వాల్ స్పెషల్ సాంగ్ — మిస్టరీ కొనసాగుతోంది!

ఫ్యాన్స్ ఎగ్జైటెడ్‌గా ఎదురుచూసిన నిధి అగర్వాల్ స్పెషల్ సాంగ్ ఇప్పటివరకు ఆడియోలోనూ, థియేటర్‌లోనూ రిలీజ్ కాలేదు. ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌లో కూడా అది లేనే లేదు!

దాంతో “మిరాయ్” ఓటీటీ రిలీజ్ చుట్టూ కొత్త క్యూయిరాసిటీ మొదలైంది — ఈ సాంగ్ ఎప్పుడొస్తుందో? లేక ఎప్పుడూ రాదా? అని ఫ్యాన్స్ చర్చలు మొదలయ్యాయి.

తేజ సజ్జ కెరీర్‌లో హను మాన్ తర్వాత మరో మాస్ వేవ్!

“మిరాయ్” థియేటర్స్ లో సాలిడ్ బజ్, విజువల్ ఎఫెక్ట్స్, మంచు మనోజ్ పవర్‌ఫుల్ విలన్ యాక్ట్ తో బ్లాక్‌బస్టర్ టాక్ అందుకుంది.
సంగీతం అందించిన గౌర హరి, ప్రొడక్షన్ వైపున పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విలువైన ప్రాజెక్ట్ గా తీర్చిదిద్దారు.

హిందీ వెర్షన్ ఎప్పుడు?

జియో హాట్‌స్టార్ పై దక్షిణ భాషల్లో రిలీజ్ అయినా, హిందీ వెర్షన్ మాత్రం నవంబర్‌లో రానుంది — కారణం థియేటర్-టు-ఓటీటీ 8 వారాల గ్యాప్ డీల్.

“మిరాయ్” ఇప్పుడు ఓటీటీలో ఉంది కానీ, ఈ చిన్న ట్విస్ట్ ఫ్యాన్స్ ని పెద్దగా కన్‌ఫ్యూజ్ చేసింది.
సాంగ్ మిస్సింగ్ సస్పెన్స్, రన్‌టైమ్ మార్పు, నిధి అగర్వాల్ మిస్టరీ – ఇవన్నీ కలిపి “మిరాయ్” ఓటీటీ రిలీజ్ ని న్యూస్ మేకర్ గా మార్చేశాయి!

, , , , ,
You may also like
Latest Posts from