‘లిటిల్ హార్ట్స్’ విజయంతో బన్నీ వాస్ మరో హిట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో, ఆయన నిర్మించిన కొత్త సినిమా మిత్ర మండలి అంచనాలకు విరుద్ధంగా నిరాశ కలిగించింది. పలు నిర్మాతలతో కలిసి చేసిన ఈ చిత్రంపై బన్నీ వాస్‌కు మంచి నమ్మకం ఉండటంతో, తెలుగురాష్ట్రాల వ్యాప్తంగా ప్రత్యేక పేడ్ ప్రీమియర్‌ షోలు నిర్వహించారు. కానీ ఈ నిర్ణయం ఇప్పుడు పెద్ద తప్పుగా మారింది.

ప్రీమియర్‌ల తర్వాత వచ్చిన రివ్యూలు పూర్తిగా నెగటివ్‌గా మారి, ప్రేక్షకుల్లో ప్రతికూల వాతావరణం సృష్టించాయి. ఫలితంగా, ఈరోజు ఉదయం, మధ్యాహ్నం షోల కలెక్షన్లు తీవ్రంగా పడిపోయాయి. మిత్ర మండలి మొదటి రోజు నుంచే కష్టాల్లో పడింది అని చెప్పాలి.

ప్రియదర్శి సినిమాలు సాధారణంగా ఓపెనింగ్స్ బాగానే తీసుకుంటుంటాయి, కానీ మిత్ర మండలి మాత్రం పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. ఉదయం షో కలెక్షన్లు అట్టడుగుకు పడిపోవడంతో, వీకెండ్‌ను కూడా దాటడం కష్టంగా మారింది.

ఇక పెద్దగా పోటీ సినిమాలు లేకపోయినా, టీమ్ ముందస్తు ప్రీమియర్‌లు ఎందుకు పెట్టిందో ప్రేక్షకులకే కాదు, ట్రేడ్ సర్కిల్స్‌కూ మిస్టరీగా మారింది. పేడ్ ప్రీమియర్‌ల వల్ల పాజిటివ్ బజ్ రావాల్సింది పోయి, నష్టమే మిగిలిందని ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం.

“మిత్ర మండలి”కి పెయిడ్ ప్రీమియర్‌లు ఇబ్బందిపెట్టాయా? లేక ప్లాన్ తప్పిందా? అన్న ప్రశ్న ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

, , , ,
You may also like
Latest Posts from