
వార్ 2 ఫ్లాప్‌పై హృతిక్ రోషన్ స్ట్రైట్ టాక్!
హృతిక్ రోషన్ ఇలాంటి మాటలు చెప్తాడా? అవును, చెప్పేశాడు.
ఇటీవల ప్రాజెక్టుల విషయంలో చాలా సెలెక్టివ్‌గా, జాగ్రత్తగా వ్యవహరిస్తున్న హృతిక్… పెద్ద హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ ప్రయత్నంలో తీసుకున్న భారీ యాక్షన్ చిత్రం ‘War 2’ (ఎన్‌టీఆర్ కూడా కీలక పాత్రలో) బాక్సాఫీస్ వద్ద ఘోరంగా నిరాశపరిచింది.
దుబాయ్‌లో జరిగిన ఒక ఈవెంట్‌లో హృతిక్‌ను “సూపర్ స్టార్” అని స్టేజ్‌పై ఇన్‌ట్రడ్యూస్ చేయగానే… వెంటనే చమత్కారంగా స్పందించాడు:
“నా సినిమా ఇప్పుడే బాక్సాఫీస్‌లో బాంబే పెట్టింది… అయినా ఇంత ప్రేమ ఇస్తున్నారు, థ్యాంక్యూ!”
వరుస హిట్స్ ఇచ్చిన యష్ రాజ్ ఫిల్మ్స్‌కైనా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ఈ భారీ ప్రాజెక్ట్ హైప్‌కు తగ్గట్టుగా నడవకపోవడం అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. కియారా అద్వాని హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం పెట్టుబడులు కూడా రికవర్ చేయలేదని టాక్.
ఇప్పుడేమో హృతిక్ పూర్తిగా ‘క్రిష్ 4’ మీద దృష్టిపెట్టాడు.
సూపర్‌హీరో ఫ్రాంచైజీకి మాత్రమే కాదు—ఈసారి డైరెక్టర్‌గా కూడా హృతిక్ స్టెప్ వేస్తుండటం పెద్ద సర్ప్రైజ్!
అదిత్య చోప్రాతో కలిసి నిర్మాణం చేస్తూ, ఈ ప్రాజెక్ట్ రెండు సంవత్సరాల పాటు షూట్ అయ్యే భారీ స్కేల్ పాన్-ఇండియా సినిమా కానుందని బాలీవుడ్ టాక్.
