తండేల్ వంటి సూపర్ హిట్ తర్వాత నాగచైతన్య ఏ సినిమా చేయబోతున్నారనేది ఖచ్చితంగా అభిమానుల ఎదురుచూసే అంశం. అయితే ఆయన ఓ వెబ్ సీరిస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. విక్రమ్ కుమార్ తో అమేజాన్ ప్రైమ్ కోసం ఆ మధ్యన దూత అనే వెబ్ సీరిస్ చేసారు. దానికి మంచి క్రేజ్ వచ్చింది.మళ్లీ ఇప్పుడు తండేల్ తర్వాత నాగచైతన్య తెలుగులో మరో వెబ్‌సిరీస్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. యథార్ఠ ఘటనల ఆధారంగా పొలిటికల్ డ్రామా థ్రిల్లర్‌గా ఈ వెబ్‌సిరీస్ తెరకెక్కబోతున్నట్లు చెబుతోన్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మధ్య ఉన్న స్నేహం, రాజకీయ వైరంతోపాటు వారి పొలిటికల్ జర్నీలోని కీలక ఘట్టాల ఆధారంగా దర్శకుడు దేవా కట్టా ఈ సిరీస్‌ను రూపొందిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ పాత్రలో నాగచైతన్య కనిపించబోతున్నారట.
ఈ సిరీస్‌లో నాగచైతన్యతో పాటు మరో టాలీవుడ్ హీరో ఆది పినిశెట్టి లీడ్ రోల్స్‌లో నటించనున్నట్లు సమాచారం.ఈ పొలిటికల్ వెబ్‌సిరీస్‌కు మయసభ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
సోనీలివ్ ఓటీటీలో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‌తో మయ సభ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తోన్నట్లు తెలిసింది.