సోషల్ మీడియా, యూట్యూబ్, AI టూల్స్ అతి వేగంగా పెరుగుతున్న ఈ కాలంలో, స్టార్ ఇమేజ్‌ని వాడుకుని సులభంగా డబ్బు చేసుకోవాలనే కొత్త మోసాలు తలెత్తుతున్నాయి.అవి కేవలం ఫేక్ వీడియోలు లేదా ఎడిటెడ్ షార్ట్స్ వరకే పరిమితం కాలేదు. AI సహాయంతో మార్ఫింగ్ వీడియోలు, పోర్న్ లింక్స్ సృష్టించడం, టీషర్టులపై హీరోల ఫోటోలు ప్రింట్ చేసి అమ్మడం, హ్యాష్‌ట్యాగ్‌లతో బిజినెస్ చేయడం – ఇలాంటి దుర్వినియోగాలు ఇప్పుడు సినీ తారల గౌరవం, వ్యక్తిగత హక్కులపై నేరుగా దాడి చేస్తున్నాయి.

ఇంతవరకూ అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్‌, అనిల్ కపూర్ వంటి బాలీవుడ్ దిగ్గజాలు మాత్రమే తమ పేర్లు, ఫోటోలు, ఇమేజ్‌లు అనుమతి లేకుండా వాడుతున్నారని కోర్టు తలుపులు తట్టారు. కానీ ఆ పరిధి ఇప్పుడు సౌత్ స్టార్‌ల వరకు విస్తరించింది.

ఇప్పుడు ఇదే సమస్యతో ఇప్పుడు టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. “నా అనుమతి లేకుండా నా పేరు, ఫోటోలు, వీడియోలు ఎక్కడా వాడకూడదు” అని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన న్యాయవాది కోర్టులో షాకింగ్ వివరాలు బయటపెట్టడంతో ఈ వ్యవహారం పెద్ద చర్చనీయాంశమైంది.

కోర్టు కూడా వెంటనే స్పందిస్తూ – “నాగార్జున పర్సనాలిటీ రైట్స్‌ను కాపాడతాం” అని స్పష్టం చేసింది.

, , , , ,
You may also like
Latest Posts from