
రవితేజ కెరీర్ ఇప్పుడు డేంజర్ జోన్లో ఉంది. వరుస ఫ్లాపులతో మాస్ మహారాజా ఫామ్ పూర్తిగా డౌన్ అయిపోయింది. ఇక ఈ నెల 31న రాబోతున్న ‘మాస్ జాతర’ ఆయనకే కాదు, శ్రీలీల, నాగవంశీ ముగ్గురికీ డెస్టినీ డిసైడ్ చేసే సినిమా!
ఒకప్పుడు “బాక్సాఫీస్ బుల్డోజర్” అనిపించుకున్న రవితేజ ఇప్పుడు ఓపెనింగ్స్ కోసం సైతం ట్రైలర్‌పై ఆధారపడే పరిస్థితి. మరోవైపు, శ్రీలీల మ్యాజిక్ కూడా కొంచెం కొంచెంగా ఫేడ్ అవుతోంది. నిర్మాత నాగవంశీ కూడా ఇటీవల ఇచ్చిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.
ఇప్పటి వరకు “మాస్ జాతర” నుంచి వచ్చిన పాటలు, టీజర్లు ప్రేక్షకులలో పెద్దగా ఉత్సాహం కలగలేదు. అందుకే ఇప్పుడు మొత్తం భారం ట్రైలర్ మీదే!
“ట్రైలర్ హిట్ అయితేనే టికెట్ సేల్!” అనేది ఫ్యాన్స్ సెంటిమెంట్.
దీపావళి హడావుడి అయిపోయిన తర్వాతే ట్రైలర్ రిలీజ్ చేసే ప్లాన్ కనిపిస్తోంది. రవితేజను మళ్లీ మీడియాలోకి తెచ్చి కామన్ ఇంటర్వ్యూలతో హీట్ పెంచే ప్రయత్నం మొదలైంది. కానీ అసలు హైప్ తెచ్చేది — నాగవంశీ ఎంట్రీ!
“కింగ్‌డమ్”, “వార్ 2” ఫలితాల తర్వాత నాగవంశీ ఎంత ఎగ్రెసివ్‌గా ప్రోమోషన్‌లోకి దిగుతారు? అన్నది పెద్ద ప్రశ్న. ఆయన ఓ ఇంటర్వ్యూ ఇచ్చినా, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్టేజ్ దంచి కొట్టినా సినిమా మీద బజ్ పెరిగే ఛాన్స్ 100%!
కానీ ఆయన మౌనంగా ఉంటే?
“మాస్ జాతర” కూడా బాక్సాఫీస్‌లో నిశ్శబ్దంగానే ముగిసే ప్రమాదం ఉంది!
