కళ్యాణ్ రామ్ సాలిడ్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు అది నిరాశే అవుతోంది. తాజాగా సీనియర్ నటి విజయశాంతి తల్లిపాత్రలో, నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి రిలీజైంది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు.

ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోకా క్రియేషన్స్ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్‌రామ్, అశోక్ వర్ధన్, సునీల్ బలుసు, ముప్పా వెంకయ్య చౌదరీలు సంయుక్తంగా నిర్మించారు. ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మార్నింగ్ షోకే డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ వీకెండ్ కూడా పూర్తి కాకుండానే కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అయ్యాయి. ఈ చిత్రానికి కన్నా ముందు ఈ దర్శకుడు ..రాజా చెయ్యవేస్తే అనే డిజాస్టర్ సినిమా ఇచ్చారు. అది పట్టించుకోకుండా కళ్యాణ్ రామ్ ఛాన్స్ ఇచ్చారు.

కళ్యాణ్ రామ్ లో నటుడుగా మంచి విషయం ఉన్నా సరైన డైరక్టర్స్ ,కథలు పడటం లేదనేది ఆయన అభిమానుల కంప్లైంట్. ఇప్పుడు అర్జున్ సన్నాఫ్ వైజయంతి తర్వాత కళ్యాణ్ రామ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడట.

ఈ క్రమంలోనే గిరీశయ్య అనే డైరక్టర్ కళ్యాణ్ రామ్‌కు ఓ కథను చెప్పినట్లు తెలుస్తోంది. కల్ట్ మూవీ అయిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని తమిళంలో ‘ఆదిత్య వర్మ’ అనే పేరుతో రీమేక్ చేశాడు గిరీశయ్య. ఇక మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ‘రంగ రంగ వైభవంగా’ సినిమాను కూడా ఆయనే డైరెక్ట్ చేశాడు.

అయితే ఆదిత్య వర్మ ఓకే అనిపించుకున్నా, ‘రంగ రంగ వైభవంగా’ డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు కళ్యాణ్ రామ్ కోసం ఓ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా కథను రెడీ చేశారని వినికిడి. దాంతో మళ్లీ మరో ప్లాఫ్ డైరక్టర్ తో కళ్యాణ్ రామ్ అవసరమా అని చాలా మంది అంటున్నారు.

You may also like
Latest Posts from