ఎప్పుడెప్పుడా అని సినిమా ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. నాని లేటెస్ట్ హిట్ కోర్ట్ చిత్రం ఓటిటి రిలీజ్ డేట్ అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. హర్ష్ రోషన్, శ్రీదేవి, ప్రియదర్శి, శివాజీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కోర్ట్’ (Court Movie).
వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నాని (Nani) సమర్పణలో ఇది తెరకెక్కింది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకువచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే కలెక్షన్ల విషయంలో పలు రికార్డులు తన ఖాతాలో వేసుకోగా.. ఇప్పుడు ఓటిటిలో తన హవా చూపించటానికి రెడీ అవుతోంది.
తాజాగా ‘కోర్ట్’ డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని నెట్‌ఫ్లిక్స్(Netflix) వెల్లడించింది. ఏప్రిల్ 11 నుంచి స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.
ఈ సినిమా విజయంపై నాని ఇటీవల మాట్లాడారు. తెలుగు సినిమాలపై అభిప్రాయాలను మార్చుకునేందుకు ‘కోర్ట్’ సరికొత్త నిర్వచనం ఇచ్చిందన్నారు. తెలుగు ప్రేక్షకుల విషయంలో గర్వపడుతున్నట్లు చెప్పారు.
రామ్ జగదీశ్ దర్శకత్వంలో కోర్ట్ రూమ్ డ్రామాగా ఇది రూపొందింది. ఇందులో నటీనటులు ముఖ్యంగా శివాజీ యాక్టింగ్ అద్భుతంగా ఉందని సినీ ప్రముఖులు సైతం మెచ్చుకున్నారు. ఇండస్ట్రీకి మరో విలన్ దొరికారని నెటిజన్లు మాట్లాడుకున్నారు.