ఈ మధ్యకాలంలో రిలీజై మంచి కామెడీ చిత్రంగా పేరు తెచ్చుకుంది ‘మ్యాడ్ స్క్వేర్’ . నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన మ్యాడ్ కు సీక్వెల్ ఇది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రూపొందించిన ‘మ్యాడ్’ చిత్రం 2023లో విడుదలై భారీ సక్సెస్ సాధించింది. ఈ బ్లాక్‌బస్టర్‌ సినిమా ‘మ్యాడ్’కి సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్‌’ని తీసుకువచ్చారు మేకర్స్. మార్చి 28న మ్యాడ్ స్క్వేర్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది.

నమ్యాడ్ స్క్వేర్ కి డివైడ్ టాక్ వచ్చిన వసూళ్ల పరంగా ఇరగతీసింది. అటు నిర్మాతలకు ఇటు బయ్యర్స్ కు ఈ సీక్వెల్ మంచి లాభాలే తెచ్చి పెట్టింది. కాగా ఈ సూపర్ హిట్ సీక్వెల్ ఓటిటి స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను రిలీజ్ కు ముందే భారీ ధరకు కొనుగోలు చేసింది నెట్ ఫ్లిక్స్.

ఇక ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ ను ఈ నెల 25న స్ట్రీమింగ్ చేస్తున్నట్టు ప్రకటించింది. తెలుగు తో పాటు తమిళ్, మలయాళం, కన్నడ అలాగే హిందీలోను ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురాబోతున్నటు తెలిపింది నెట్ ఫ్లిక్స్.

కేవలం 28 రోజుల థియేట్రీకల్ రన్ తర్వాత ఓటీటీలో రిలీజ్ అవుతోంది మ్యాడ్ స్క్వేర్. థియేటర్ లో భారీ వసూళ్లు రాబట్టిన ఈ సీక్వెల్ నెట్ ఫ్లిక్స్ లో ఏ మేరకు సందడి చేస్తుందో చూడాలి.

, , ,
You may also like
Latest Posts from