
రిలీజ్‌కు ముందే లాభాలు?! నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇవే!
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘అనగనగా ఒక రాజు’ . ఈ సంక్రాంతికి జనవరి 14న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా, బాక్సాఫీస్ దగ్గర అప్పుడే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. భారీ హీరోల మధ్యలో వస్తున్నా, ఈ సినిమా చేసిన ప్రీ-రిలీజ్ బిజినెస్ చూసి ట్రేడ్ వర్గాలు సైతం షాక్ అవుతున్నాయి.
టేబుల్ ప్రాఫిట్స్.. నిర్మాత సేఫ్!
సిద్ధార్థ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు ముందే నిర్మాతలను లాభాల్లోకి నెట్టేసింది. నాన్-థియేట్రికల్ హక్కులు (ఓటీటీ, శాటిలైట్, ఆడియో) ద్వారానే సుమారు రూ. 50 కోట్లకు పైగా బిజినెస్ జరిగిందని సమాచారం. అంటే సినిమా థియేటర్లో ఒక్క రూపాయి వసూలు చేయకముందే నిర్మాతలు గట్టిగానే వెనకేసుకున్నారన్నమాట.
ఏరియా వైజ్ థియేట్రికల్ బిజినెస్ లెక్కలు (Pre-Release Business):
ప్రాంతం బిజినెస్ (కోట్లలో)
నైజాం (తెలంగాణ) 7 కోట్లు
ఆంధ్రా 10 కోట్లు
సీడెడ్ 2.5 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా (ROI) 1.75 కోట్లు
ఓవర్సీస్ 7 కోట్లు
మొత్తం వరల్డ్ వైడ్ 28 కోట్లు
100 కోట్ల క్లబ్ పై కన్ను!
నవీన్ పోలిశెట్టి క్రేజ్, సంక్రాంతి సీజన్, మరియు సినిమాలో ఉన్న కామెడీ కంటెంట్‌ను బట్టి ఈ సినిమా సులభంగా రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధిస్తుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. కేవలం 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగుతున్న రాజు గారు, బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో విధ్వంసం సృష్టిస్తారో చూడాలి.
దర్శకుడు మారి తెరకెక్కించిన ఈ రూరల్ ఎంటర్‌టైనర్‌లో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. నవీన్ ఎనర్జీకి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ తోడవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
