సినిమా వార్తలు

‘అఖండ 2’కి ఓవర్‌సీస్‌లో అఖండ రేటు – బాలయ్యకు కెరీర్‌లోనే హయ్యెస్ట్ డీల్!

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ – మాస్ మేకర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2 : తాండవం’ సినిమా చుట్టూ అఖండ స్థాయిలో హైప్ నెలకొంది. వీరిద్దరి కలయికలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు మూడు మూడూ బ్లాక్‌బస్టర్లు కావడంతో, ఈ సారి ఫ్యాన్స్ అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.

ఇంతలోనే ఈ సినిమా ఓవర్‌సీస్ బిజినెస్‌పై షాకింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం, ‘అఖండ 2’ ఓవర్‌సీస్ రైట్స్ ఏకంగా ₹15 కోట్లకు క్లోజ్ అయ్యాయి!
ఇది బాలకృష్ణ కెరీర్‌లో ఇప్పటివరకు వచ్చిన హయ్యెస్ట్ ఓవర్‌సీస్ డీల్!

Moksha Movies, Cine Galaxy USA, మరియు Sree Vaishnavi Entertainment కలిసి ఈ సినిమాను అమెరికా సహా ఓవర్‌సీస్ మార్కెట్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. డిసెంబర్ 4న యూఎస్‌లో ప్రీమియర్స్ ఉండగా, ఇప్పటికే టికెట్ అడ్వాన్స్ బుకింగ్స్‌పై ఫ్యాన్స్ పిచ్చి స్థాయిలో రియాక్షన్ చూపిస్తున్నారు.

నార్త్ అమెరికాలో బాలయ్య సినిమాలకు ఇటీవల మంచి పాజిటివ్ మార్కెట్ ఏర్పడింది. ప్రత్యేకంగా ‘అఖండ’ బ్రాండ్ పవర్ కారణంగా ఈ సీక్వెల్‌పై డిస్ట్రిబ్యూటర్లలో పెద్ద పోటీ. ఫైట్ నడిచిందట. చివరికి ₹15 కోట్ల భారీ ధరకు డీల్ క్లోజ్ కావడంతో, ట్రేడ్ వర్గాలు “ఇది బాలయ్య కెరీర్‌లో గేమ్‌చేంజర్ మోమెంట్!” అని అంటున్నాయి.

ట్రేడ్ అనలిస్టుల లెక్కల ప్రకారం —

‘అఖండ 2’ ఓవర్‌సీస్ సక్సెస్‌గా పరిగణించాలంటే $2 మిలియన్ గ్రాస్ దాటాలి. ఇంత హైప్‌తో, బోయపాటి విజన్‌తో, బాలయ్య ఎనర్జీతో అది సాధ్యం కాని పనేం కాదు అంటున్నారు ఫ్యాన్స్.

ఇక బాలయ్య మాస్, బోయపాటి స్టైల్, అఖండ బ్రాండ్ — ఈ మూడు కలిస్తే థియేటర్‌ల్లో మాత్రమే కాదు, ఓవర్‌సీస్‌లో కూడా తాండవం గ్యారెంటీ!

Similar Posts