
పాత స్టూడియోలు, కొత్త బాస్! – హాలివుడ్ కొత్త రాజు Netflix?
ప్రపంచంలో సినిమాల గురించి మాట్లాడితే మొదట గుర్తుకొచ్చే పేరు Netflix. లైబ్రరీ లేదు… స్టూడియో లేదు… అప్పట్లో కేవలం ఇతరుల నుండి కంటెంట్ తీసుకుని అద్దెకు చూపించే చిన్న ప్లాట్‌ఫాం మాత్రమే. కానీ ఒరిజినల్ కంటెంట్‌కు పెట్టిన పందెం Netflix ను హాలీవుడ్‌లో ఊహించలేని స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పుడు ఈ సంస్థకే కాదు, కంటెంట్ ప్రపంచానికే యజమాని ఎవరు? అనే ప్రశ్నకు చాలా మంది ఒకే సమాధానం చెబుతున్నారు — Netflix! ఈ ప్రభావం ఏ రేంజ్‌లో ఉందంటే… ఇతర స్టూడియోలు కంటెంట్ చేస్తాయి, Netflix ట్రెండ్ చేస్తుంది. అందుకే ఇప్పుడు నేరుగా హాలివుడ్ స్టూడియోను కొనేసింది!
72 బిలియన్ డాలర్ల షాకింగ్ కొనుగోలు
అవును… ఇదే నిజం. Netflix, Warner Bros Discovery స్టూడియోలు + స్ట్రీమింగ్ యూనిట్‌ను కొనుగోలు చేసే డీల్‌కు సై చెప్పింది.
ఈ డీల్ విలువ 72 బిలియన్ డాలర్లు! (సుమారు ₹6.47 లక్షల కోట్లు!). ఒక్కో Warner Bros షేర్‌కు $27.75 చెల్లించేందుకు Netflix బిడ్ వేసింది.
ఇప్పుడు Warner Bros CNN, TBS, TNT వంటి కేబుల్ ఛానళ్లలో చేస్తున్న రీస్ట్రక్చరింగ్ పూర్తయిన తర్వాత మాత్రమే కొనుగోలు పూర్తి అవుతుంది. కానీ ఒక్క విషయం క్లియర్ — హాలివుడ్ పవర్ సెంటర్ మారుతోంది.
ఒరిజినల్స్‌తో జయించింది, ఇప్పుడు స్టూడియో వారసత్వాన్ని కూడా కొనేసింది.
END — HBO, Harry Potter, Friends… అంతా Netflix చేతుల్లో!
ఈ డీల్ ఫైనల్ అయితే…
ప్రపంచంలో అత్యంత ప్రఖ్యాతమైన లైబ్రరీ & బ్రాండ్లు ఎవరి దగ్గర ఉంటాయి?
HBO నెట్‌వర్క్
The Sopranos
The White Lotus
Harry Potter
Friends
వందలాది సినిమాలు, సిరీస్‌లు, ఆర్కైవ్స్…
అన్నీ Netflix కంట్రోల్‌లోకే!
ఇప్పటి వరకు Netflix కేవలం కంటెంట్ స్ట్రీమింగ్ చేసే సంస్థ…
ఇక నుంచి హాలివుడ్ స్టూడియోలకు యజమాని!
ఇది కేవలం కొనుగోలు కాదు… ఇది డిజిటల్ యుగంలో పవర్ మార్పు.
హాలివుడ్‌లో ఇక కొత్త చాప్టర్:
స్టూడియోలు కంటెంట్ చేస్తాయి… Netflix ప్రపంచాన్ని నడుపుతుంది!
