పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భారీ అంచనాలతో వచ్చిన బ్లాక్‌బస్టర్ “They Call Him OG” అక్టోబర్ 23 నుండి అన్ని భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదే సమయంలో ధనుష్ నటించిన “Idli Kadai” (ఇడ్లీ కొట్టు) అక్టోబర్ 29న డిజిటల్ ప్లాట్‌ఫారమ్ పై వచ్చింది.
కానీ ఏమైంది తెలుసా? ఆలస్యంగా వచ్చి కూడా ఇడ్లీ కడై OGను వ్యూస్ పరంగా ఓవర్‌టేక్ చేసింది! ఇది ఇప్పుడు ఇండస్ట్రీలోనూ, ఫ్యాన్స్‌లోనూ హాట్ టాపిక్.
OG vs Idli Kadai: నెట్‌ఫ్లిక్స్ వ్యూస్ వార్
OG వ్యూస్ (Oct 23–Nov 2):
1వ వారం (Oct 23–26): 3.2 మిలియన్
2వ వారం (Oct 27–Nov 2): 2.1 మిలియన్
మొత్తం 11 రోజులు: 5.2 మిలియన్ వ్యూస్
Idli Kadai వ్యూస్ (Oct 29–Nov 2):
కేవలం 5 రోజుల్లో: 5.1 మిలియన్ వ్యూస్
అంటే, 5 రోజులకే OG 11 రోజుల రికార్డును టచ్ చేసినట్టే!
ఇండస్ట్రీ షాక్ – ఫ్యాన్స్ కన్ఫ్యూజ్!
భారీ స్కేల్, ఫ్రాంచైజ్ హైప్, పవర్‌స్టార్ క్రేజ్… అన్నీ OG వైపే ఉన్నాయి. పైగా OTT డీల్ కూడా చాలా భారీ.
అయినా Idli Kadai ఇలా స్పీడ్‌గా దూసుకెళుతుండటం నెట్‌ఫ్లిక్స్ గేమ్ ఎలా ఉందో అర్థం కావడం లేదని సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువ.
బిజినెస్ పర్స్పెక్టివ్
OG స్ట్రీమింగ్ ప్రారంభంలోనే భారీ పుల్ తీసుకురావాలని ట్రేడ్ ఎక్స్‌పెక్ట్ చేసింది. కానీ ఇప్పటివరకు అంచనాలకు తగ్గట్టుగా రన్ అవ్వలేదు.
మరిన్ని రోజుల్లో కంటిన్యూ చేసి వ్యూస్ పెంచుకోవాల్సిందే అంటే ఇదే.
ఇంకా ఇలాంటి టాలీవుడ్ OTT ట్రెండ్స్ కోసం ఫాలో అవ్వండి!

